twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకయ్యే రేంజిలో ఆ హీరోల రెమ్యూనరేషన్ (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మన పొరుగున ఉన్న తమిళ సినీ పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమతో పోటా పోటీగా ముందుకు సాగుతోంది. తమిళ సినిమా మార్కెట్ తెలుగుతో కర్నాటక, కేరళల్లోనూ విస్తరించింది. అదే విధంగా యూకె, మలేషియా లాంటి దేశాల్లోనూ తమిళ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.

    రజనీకాంత్, విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలకు సొంత రాష్ట్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో మంచి డిమాండ్. అందుకే వీరికి డిమాండ్ బాగా ఉంది. డిమాండ్‌కు తగిన విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్ లాంటి స్టార్ల రెమ్యూనరేషన్ వింటే మన కళ్లు పైర్లు కమ్మాల్సిందే.

    తమిళ స్టార్ హీరోల్లో ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయాలు స్లైడ్ షోలో ఓ లుక్కేద్దాం....

    రజనీకాంత్

    రజనీకాంత్


    రజనీకాంత్ నటించే సినిమాలకు తమిళనాడుతో పాటు తెలుగు, హిందీలోనూ మంచి డిమాండ్ ఉంది. ఇందుకుగాను ఆయన రూ. 30 కోట్ల వరకు తీసుకుంటారట. కేవలం తమిళం సినిమా అయితే రూ. 20 నుండి 25 కోట్లు తీసుకుంటారట.

    కమల్ హాసన్

    కమల్ హాసన్


    యూనివర్సల్ హీరోగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ సినిమాకు రూ. 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక డైరెక్షన్, రచయిత లాంటి బాధ్యతలు కూడా చేపడితే ఎక్స్ ట్రా చార్జ్ చేస్తాడట.

    విజయ్

    విజయ్


    తమిళనాడులో రజనీ, కమల్ తర్వాత ఫాంలో ఉన్న స్టార్ హీరో విజయ్. ఈ హీరో ఒక్కో సినిమాకు రూ. 18 నుండి 20 కోట్లు తీసుకుంటారట.

    సూర్య

    సూర్య


    ఇక తమిళ హీరో సూర్య నటించిన సినిమాలకు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. ఒక్కో సినిమాకు రూ. 18 కోట్లు తీసుకుంటారట. దీంతో పాటు తెలుగు రైట్స్ అదనం. తెలుగు రైట్స్ ద్వారా మరో 5 కోట్లు ఆయనకు అదనంగా వస్తాయని అంచనా.

    అజిత్ కుమార్

    అజిత్ కుమార్


    బాక్సాఫీసు కింగ్‌గా మారిన అజిత్...ఒక్కో సినిమాకు రూ. 18 కోట్ల నుండి రూ. 20 కోట్ల వరకు తీసుకుంటారని అంచనా.

    విక్రమ్

    విక్రమ్


    హీరో విక్రమ్ ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల వరకు తీసుకుంటాడు. ఆయన సినిమాలు తెలుగులోనూ బాగా ఆడతాయి.

    కార్తి

    కార్తి


    తమిళ హీరో కార్తికి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ హీరో ఒక్కో సినిమాకు రూ. 8 నుండి 10 కోట్ల వరకు తీసుకుంటాడట.

    ధనుష్

    ధనుష్


    తమిళ హీరో ధనుష్ ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.

    శింబు

    శింబు


    మరో తమిళ హీరో శింబు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.

    ఆర్య

    ఆర్య


    తమిళ హీరో ఆర్య ఒక్కో సినిమాకు రూ. 4 నుండి 5 కోట్లు తీసుకుంటున్నాడని టాక్.

    విశాల్

    విశాల్


    హీరో విశాల్ ఒక్కో సినిమాకు రూ. 4 నుండి 5 కోట్ల వరకు తీసుకుంటాడని సమాచారం.

    జీవా

    జీవా


    రంగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.

    English summary
    Films of Rajinikanth, Vijay, Surya and many others get good opening in many parts of Southern India. Hence, their remuneration or salary too have increased. Today, the stars draw fat paycheques. Here, we bring you the list of Tamil actors' remuneration as in 2014 or the highest paid actors in Kollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X