twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బట్టలు విప్పి దారుణంగా హింసించారు.. లాకప్‌డెత్‌పై సెలెబ్రిటీలు ఫైర్

    |

    తమిళనాడులో జరిగిన ఓ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. పోలీస్ కస్టడీలో తండ్రీకొడుకులు మరణించడంపై తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారికి న్యాయం జరగాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో గత కొన్ని రోజుల క్రితం జార్జ్ ఫ్లాయిడ్ ఘటనపై సినీ లోకం స్పందించడం, బ్లాక్ లివ్స్ మ్యాటర్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో నానా రచ్చ చేశారు. అయితే మన భారతీయులకు ఇలా జరిగితే ఎవ్వరూ స్పందించరని, తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందించకపోవడంపైనా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    లాక్ డౌన్‌లో ఎక్కువ సేపు..

    లాక్ డౌన్‌లో ఎక్కువ సేపు..

    పోలీస్ కస్టడిలో జయరాజ్, ఫినిక్స్ అనే ఇద్దరూ చనిపోయిన ఘటన ట్యూటికోరన్‌లో జరిగింది. లాక్ డౌన్‌లో తమ షాపును చెప్పిన సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచినందుకు పోలీసులు ఆ తండ్రీకొడుకులను తీసుకున్నారు. లాకప్‌లో చిత్ర హింసలు పెట్టారు. దీంతో వారిద్దరూ మరణించారు. అయితే వారికి న్యాయం జరగాలని తమిళ ప్రజలు పోరాటం చేస్తున్నారు.

    స్పందించిన సుచిత్ర..

    స్పందించిన సుచిత్ర..

    సుచీ లీక్స్ పేరిట ఫేమస్ అయిన సింగర్ సుచిత్ర ఈ ఘటనపై స్పందించింది. దక్షిణాది సమస్యలు ఎప్పుడూ దక్షిణాదికే పరిమితం అవుతున్నాయని, వారు ఇంగ్లీష్‌లో మాట్లడలేకపోవడమే అందుకు కారణమని చెప్పుకొచ్చింది. అందుకే ఈ ఘటన గురించి వివరాలను, పోలీసుల అకృత్యాలను తాను వివరించి చెబుతానని, ఈ విషయం అందరికీ తెలిసేలా ఫార్వర్డ్ చేయండని కోరింది.

    బట్టలు విప్పి..

    బట్టలు విప్పి..

    వారిద్దరి మోకాళ్లను, మోచేతులను విరగ్గొట్టారని, ఆపై వారి మొహాన్ని గోడకు కొట్టి పచ్చడి చేశారని తెలిపింది. థర్డ్ డిగ్రీలో భాగంగా వారి జననాంగాలలో కట్టలు, బాటిళ్లను దూర్చారని, రక్తం విపరీతంగా ప్రవహించిందని, వారిని అలాగే నగ్నంగా ఉంచారని పోలీసులు అకృత్యాలను వివరించింది. ఇప్పటికీ ఈ ఘటనలో ఇద్దర్నీ సస్పెండ్ చేశారని, మరో ఇద్దర్నీ బదిలీ చేశారని చెప్పుకొచ్చింది. ఇది మాత్రమే సరిపోదని, న్యాయం జరిగే వరకు వదిలి పెట్టకూడదని తెలిపింది.

    Recommended Video

    Penguin Trailer | Penguin OTT Worldwide Release on June 19
     సెలెబ్రిటీల స్పందన..

    సెలెబ్రిటీల స్పందన..

    కేవలం సుచిత్ర మాత్రమే కాకుండా జయం రవి, జీవా, హన్సిక వంటి వారు సైతం ఈ ఘటనపై స్పందించారు. JusticeForJeyarajAndFenix అనే హ్యాష్ ట్యాగ్‌తో అందరూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని వారికి న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

    English summary
    kollywood Demands Justice For Jeyaraj And Fenix In tuticorin. Singer Suchithra Says That Please share & tag fwd so non-tamil-speaking people can understand what happened
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X