మరో ప్రయోగానికి సిద్దమవుతున్న చియాన్ విక్రమ్.. న్యూ కోబ్రా లుక్!

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పాత్రలో ప్రాణం పెట్టి నటించగల గ్రేట్ హీరోల్లో విక్రమ్ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో చూపించే హావభావాలు రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. శివపుత్రుడు సినిమా నుంచి ఐ వరకు కూడా విక్రమ్ సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ దక్కింది.

అపరిచితుడు సినిమా తెలుగులో అప్పట్లో భారీ వసూళ్లను అందుకుంది. అయితే విక్రమ్ కమర్షియల్ బాక్సాఫీస్ వద్ద హిట్టు చూసి చాలా కాలమయ్యింది. పాత్రలతో ప్రయోగాలు బాగానే చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ రావడం లేదు. కథలో లోపాలు అలాగే మేకింగ్ లో లోపాల వలన విక్రమ్ సినిమాలు అంతగా క్లిక్కవ్వడం లేదు. విక్రమ్ నెక్స్ట్ కోబ్రా అనే మరొక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు.

Kollywood hero Chiyaan vikram new cobra look viral

ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ థ్రిల్లర్ సినిమాలో విక్రమ్ విభిన్నమైన పాత్రలతో కనిపించనున్నాడు. ఇక ఇటీవల షూటింగ్ లో దర్శకుడు సీన్ ను విస్తరిస్తున్న ఒక ఫొటోను విడుదల చేశాడు. అందులో విక్రమ్ ఒక డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. దాదాపు 150కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ దొంగగా కనిపిస్తాడట. వేషాలు మారుస్తూ తెలివిగా దోపిడీలు చేస్తాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా విక్రమ్ బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X