»   » తమిళ హీరో "జై" కారు కి యాక్సిడెంట్: మరణం అంచుల్లోకి వెళ్ళొచ్చిన తమిళ యువ హీరోలు

తమిళ హీరో "జై" కారు కి యాక్సిడెంట్: మరణం అంచుల్లోకి వెళ్ళొచ్చిన తమిళ యువ హీరోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ యువ నటులు జై, ప్రేమ్‌జీలు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గురువారం ఉదయం మందవల్లి నుంచి ప్రయాణిస్తున్న 'ఆడి' కారు అడయార్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఆ సమయంలో కారును జై డ్రైవ్ చేస్తున్నాడు. బ్రిడ్జి గోడను ఢీకొట్టిన కారు కొంతదూరం ప్రయాణించి ఆగిపోయింది.

ఈ ప్రమాదం నుంచి నటులు ఇద్దరు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఆసమయం లో ట్రాఫిక్ ఎక్కువగా లేకపోవటం, కారుని సరైన సమయం లో అదుపు చేయటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. "కారు దెబ్బతిన్న పరిస్తితిని చూస్తే మాత్రం ఈ ఇద్దరూ ఎంతటి ప్రమాదం నుంచి బయటపడ్డారో అర్థమైపోతోంది, నిజానికి ఆ సమయం లో వారు సరైన స్థితిలో లేరు" అంటూ అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి తెలిపారు.

kollywood Heros Jai, Premji Escape Unhurt In Road Accident

ఘటనా స్థలానికి చేరుకున్న శాస్త్రినగర్ పోలీసులు 'జై' తాగి కారును నడిపినట్టు గుర్తించారు. కారు డ్రైవ్‌ చేస్తున్న జై అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.అంతేకాక జై కి రూ.500/- జరిమానా విధించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను ప్రేమ్‌జీ కొట్టిపడేశాడు. అది చాలా చిన్న ప్రమాదమని, తాను, జై క్షేమంగానే ఉన్నట్టు తెలిపాడు. జై నటించిన 'బెలూన్' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకు శైనిష్ దర్శకత్వం వహించాడు.

English summary
Actors Jai and Premji met with an accident early Monday morning near Adyar bridge in Chennai. Jai, who was driving the car an Audi rammed into the wall of the bridge. The actors escaped unhurt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu