ధనుష్ ను మెప్పించిన మరో తెలుగు దర్శకుడు అతనేనా.. నిర్మాత కూడా ఫిక్స్?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా కంటే కూడా ఒక విభిన్నమైన నటుడిగా ధనుష్ అందుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో కూడా బాక్సాఫిష్ హిట్టు కొట్టిన ధనుష్ ఇప్పుడు హాలీవుడ్ లో కూడా బిజీ అయ్యాడు. ఇక మొదటిసారి టాలీవుడ్ దర్శకుడితో చేతులు కలపడంతో ఒక్కసారిగా సౌ5హ్ ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ చేసినట్లయ్యింది.
శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడితో ధనుష్ ఎలాంటి ప్రయోగం చేస్తాడో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమా హిందీ తమిళ్ తెలుగులో ఒకేసారి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తప్పకుండా ధనుష్ టాలీవుడ్ లో ఒక మార్కెట్ అయితే సెట్ చేసుకోగలడని టాక్ అయితే వస్తోంది. ఇక ఆ విషయాన్ని ముందే పసిగడుతున్న కొంతమంది నిర్మాతలు అతనితో సినిమా చేసేందుకు అగ్రిమెంట్ సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట.

ఇక ప్రముఖ సీతారా ఎంటర్టైన్మెంట్స్ కూడా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సినిమా చేస్తానని మాట ఇచ్చిన ధనుష్ కథ నచ్చితేనే అగ్రిమెంట్ పై సైన్ చేస్తానని చెప్పాడట. ఇక వెంకీ అట్లూరితో ఇటీవల ఒక కథ సెట్ చేయించినట్లు తెలుస్తోంది. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే వంటి రొమాంటిక్ సినిమాలను తీసిన వెంకీ ధనుష్ కు ఎలాంటి కథను సెట్ చేస్తాడనేది చూడాలి. మొత్తానికి దనుష్ అయితే విజయ్ తరహాలోనే తెలుగు మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ అయితే పెట్టినట్లు తెలుస్తోంది. మరి అతని ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











