Don't Miss!
- News
సమయం లేదు మిత్రమా.. బీజేపీలో ఈటల రాజేందర్ కు పెద్ద కష్టమే!!
- Sports
INDvsNZ : తొలి టీ20 పిచ్ రిపోర్ట్.. టీమిండియా మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Finance
world richest: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే.. మరి అంబానీ, అదానీల స్థానమెంతో తెలుసా ?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Atlee: తండ్రి కాబోతున్న స్టార్ దర్శకుడు.. భార్యతో స్పెషల్ స్టిల్స్!
తమిళ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ప్రస్తుతం మంచి గుర్తింపును అందుకుంటున్న అగ్ర దర్శకుల్లో అట్లీ ఒకరు. ఈ దర్శకుడు 2014లో శ్రీకృష్ణప్రియను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తరచుగా వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కృష్ణప్రియ కూడా అట్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎంతో అన్యోన్యంగా జీవించే ఈ బ్యూటిఫుల్ జంట ఇటీవల వారి ఫాలోవర్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
త్వరలోనే కుటుంబం పెద్దది కాబోతోంది అంటూ వారు అధికారికంగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తల్లిదండ్రులు కాబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వారికి ఫ్యాన్ ఫాలోవర్స్ నుంచి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా అందుతున్నాయి. ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అని ఇంత కాలంగా మా యోగక్షేమాలను గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు.

అలాగే ఇప్పుడు ఈ శుభ సమయంలో ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు కూడా ఎంతో సంతోషంగా ఉందని కూడా అట్లీ కృష్ణప్రియ సోషల్ మీడియాలో వారి ఆనందాన్ని తెలియజేశారు. ఇక అట్లీ కృష్ణప్రియ కలిసి ఏ ఫర్ ఆపిల్ అని ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించిన విషయం తెలిసిందే. అందులో వీరు కొన్ని మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా నిర్మించారు.

దర్శకుడు అట్లీ తనతో పాటు వచ్చే శిష్యులకు కూడా ఆ ప్రొడక్షన్ లో సినిమాలు చేసే అవకాశాలను అందిస్తున్నాడు. ఇక పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత ఈ జంట వారి మొదటి ప్రెగ్నెన్సీ గురించి తెలియజేసింది. ఇక ప్రస్తుతం అయితే వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అట్లీ సినిమాల విషయానికి వస్తే వరుసగా విజయ్ తో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.