twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేదం క్లైమాక్స్ మార్చి హిట్ కొట్టాను: దర్శకుడు క్రిష్

    By Srikanya
    |

    క్లైమాక్స్ సన్నివేశాల్నీ మార్చాను. ఆ మార్పులు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. అనుష్క, శింబు పాత్రలు అక్కడి యువతకి నచ్చాయి అంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు దర్శకుడు క్రిష్.ఆయన 'వేదం' చిత్రాన్ని తమిళంలో 'వానమ్‌' పేరుతో పునర్నిర్మించారు. తమిళ ప్రేక్షకుల్ని ఆ సినిమా ఆకట్టుకొంది. త్వరలో ఈ సినిమాను హిందీలో తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఆ విషయాన్ని మీడియాకు వివరిస్తూ ఇలా స్పందించారు.అలాగే ''వేదం కథని నేను ఎన్నిసార్లు చెప్పడానికైనా సిద్ధమే. అంతలా నాలో అంతర్లీనమైపోయింది. 'వేదం' తరువాత నేను మరో సినిమా కోసం కథ సిద్ధం చేసుకొనే ప్రయత్నాల్లోపడ్డాను.

    ఆ సమయంలోనే తమిళ నిర్మాతలు సంప్రదించి ఆ భాషలోకి రీమేక్‌ చేద్దామన్నారు. 'వేదం' సినిమాను తమిళ ప్రేక్షకులు కొందరు చూసేశారు. వాళ్లకీ బోరు కొట్టకుండా ఉండాలని కొన్ని మార్పులు చేశాను. ప్రధానంగా ఇక్కడ మనోజ్‌ బాజ్‌పేయి చేసిన రెహమాన్‌ అనే పాత్రను చాలా మార్చాను. అక్కడ ప్రకాష్‌రాజ్‌ నటించారు. ఆయన నటనకీ, పాత్రకీ ఎంతో మంచి స్పందన వచ్చింది. నేను చెన్నైలోని సత్యమ్‌ థియేటర్లో ప్రేక్షకుల మధ్య చిత్రం చూశాను. వారి స్పందన నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. హిందీ 'వేదం' ప్రతిపాదన వచ్చింది. ఎప్పుడు చేసేది వెంటనే చెప్పలేను'' అన్నారు.

    English summary
    Speaking to a leading daily, Krish has confirmed that Vedam will be remade in Hindi and he is directing the Hindi version as well. He further said that he is happy to remake his own film for the third time. But he has not revealed about the cast and crew of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X