»   »  రజనీ 'కధానాయకుడు' కథ మారిందా...

రజనీ 'కధానాయకుడు' కథ మారిందా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kathanayakudu
మళయాళ సూపర్ హిట్ 'కథా పెరియంబోల్' చిత్రాన్ని పి.వాసు తెలుగు,తమిళ భాషల్లో 'కథానాయకుడు', 'కుసేలన్' గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒరిజనల్ కథలో ప్రధాన పాత్ర ఓ బార్బర్ చుట్టూ తిరుగుతుంది. అతను ,అతనుండే పల్లె మొత్తం పేదరికం తో మునిగిపోయి ఉంటారు. అప్పుడు అతని బాల్య మిత్రుడు పెద్ద సినిమా స్టార్ అయి ఆ పల్లెకే వచ్చి పరిస్ధితి తెలుసుకుని సాయం అందిస్తాడు. అయితే పి.వాసు ఇప్పుడు దాన్ని మార్చినట్లు తెలుస్తోంది.

'కథానాయకుడు' కథ ప్రకారం రజనీకాంత్, జగపతిబాబు ఒక లోకల్ బస్ సర్వీసులో కండక్టర్, డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. రజనీకి నటన మీదున్న ఆసక్తి వల్ల ఉద్యోగాన్ని వదులుకుని సినీ ఫీల్డుకి వెళతాడు. అనుకున్నట్లే స్టార్ హీరోగా ఎదుగుతాడు. ఆ తర్వాత స్నేహితుడైన జగపతికి సాయం చేద్దామని వాళ్ల పట్నానికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మాత్రం సినిమాలో చూడాల్సిందే. అంటే రజనీ కాంత్ జీవితానికి దగ్గరగా ఉండే కథగా మార్చి మ్యాజిక్ సృష్టించబోతున్నారన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X