»   » ‘జాక్ పాట్’ ఖుష్బూకి జయా టీవి ఝలక్!

‘జాక్ పాట్’ ఖుష్బూకి జయా టీవి ఝలక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీనటి కుష్బూకు జయా టీవీ ఝలక్ ఇచ్చింది. ఖుష్భూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నపాపులర్ 'జాక్ పాట్" రియాల్టీ గేమ్ షోను అర్థాంతరంగా నిలిపి వేసింది. గత పదేళ్లుగా ప్రసారమవుతున్న ఈ షోను అర్థాంతరంగా ఆపివేయడంపై ఆరా తీయగా ఖుష్బూ రాజకీయమే ఇందుకు కారణమని తెలిసింది. ఇటీవల ఖుష్బూ తమిళనాడులో అధికారంలో ఉన్నడిఎంకె పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిలిపి వేశారు.

జయా టీవీ ఏఐఏడీఎంకె అధినేత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ బంధువులకు చెందినది కావడంతో ఖుష్బూ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని వారు 'జాక్ పాట్" ప్రసారాన్ని నిలిపి వేశారు. ఈ విషయమై ఖుష్బూను అడుగగా తాను ముందే ఊహించానని, నేను డీఎంకెలో చేరడం జయా టీవీ యాజమాన్యానికి ఇష్టం లేదని వెల్లడించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu