»   » పెద్ద షాక్ :కువైట్ లో హీరో సూర్య తాజా చిత్రం పై బ్యాన్

పెద్ద షాక్ :కువైట్ లో హీరో సూర్య తాజా చిత్రం పై బ్యాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూర్య తాజా చిత్రం మాస్ (తెలుగులో రాక్షసుడు) రిలీజ్ కు ఇంకొన్ని రోజులే టైమ్ మిగిలి ఉంది. ఈ నేపధ్యంలో అంతా రెడి అవుతూంటే ఆయన చిత్రానికి ఇప్పుడు కువైట్ లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రాన్ని అక్కడ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎందుకంటే సినిమాలో హీరోకు సూపర్ పవర్స్ ఉన్నాయని అది తమ మత విశ్వాశాలకు విరుద్దమని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇస్లామిక్ కంట్రీ అయిన కువైట్ ...తమ దేశ మత విశ్వాసాలను గౌరవిస్తుంది. భగవంతుడుకు తప్ప వేరెవరుకి సూపర్ పవర్స్ ఉండవన్ నమ్ముతుంది. అందుచేతనే అక్కడ ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినట్లు సమాచారం.


Kuwait Shocker for Suriya's Masss movie

కువైట్ గవర్నమెంట్ ఇదే తొలిసారి కాదు..ఇలా ఇండియన్ చిత్రాలు బ్యాన్ చేయటం. గతంలో ...అక్కడ విశ్వరూపం చిత్రం కూడా మతానికి సంభందించిన కాంట్రవర్శీలు ఉన్నాయని బ్యాన్ చేసింది. అలాగే..లారెన్స్ తాజా హర్రర్ చిత్రం గంగ, మరో హర్రర్ చిత్రం డిమనోట్ కాలనీ కూడా అక్కడ బ్యాన్ చేసారు.


తమిళ సినిమాలకు నిజానికి మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ మంచి మార్కెట్..వాటిలో కువైట్ లో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తూంటాయి. ఎందుకంటే తమిళులు అక్కడకి ఎక్కువ వలస వెళ్లారు. ఈ బ్యాన్ తో ఈ చిత్రం కొంతమేరకు బిజినెస్ కోల్పోతుందని ట్రేడ్ లో కంగారుపడుతున్నారు.


చిత్రం తెలుగు వెర్షన్ విషయానికి వస్తే...


సూర్య హీరోగా నటించిన చిత్రమిది. నయనతార, ప్రణీత హీరోయిన్స్. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


Kuwait Shocker for Suriya's Masss movie

దర్శకుడు మాట్లాడుతూ... రాక్షసుడంటే నెత్తిమీద రెండు కొమ్ములు, నిప్పులు చిమ్మే కళ్లు, బయటకొచ్చిన పళ్లూ, ఒళ్లంతా రక్తం ఇవేం వూహించుకోకండి. ఇతనో స్త్టెలిష్‌ రాక్షసుడు. ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు, మంచి కోసం ప్రాణాలిస్తాడు. కానీ అతన్ని అంతా 'రాక్షసుడు' అని పిలుచుకొన్నారు. కారణమేంటో తెలియాలంటే 'రాక్షసుడు' సినిమా చూడాల్సిందే అన్నారు.


నిర్మాతలు మాట్లాడుతూ ''సూర్య ప్రయాణం ముందు నుంచీ వైవిధ్యభరితంగానే సాగుతోంది. 'గజిని', 'సింగం' లాంటి చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకొన్నారు. 'రాక్షసుడు' ఆ చిత్రాల జాబితాలో చేరుతుంది. ఈ చిత్రంలో సూర్య విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారు. ఆయన పాత్ర పెద్దలకే కాదు, పిల్లలకూ నచ్చుతుంది. హారిస్‌ జైరాజ్‌ అందించిన బాణీలకు చక్కటి స్పందన వస్తోంది''అన్నారు. సమర్పణ: జ్ఞాన్‌వేల్‌రాజా

English summary
Suriya's Masss faced a huge shock in the Middle Eastern country of Kuwait. Apparently, the Kuwait government has banned the release of Masss because the film has a hero who has super powers.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu