twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే కథతో ప్రియమణి్,హీరో సూర్య

    By Srikanya
    |

    చెన్నై: ఇప్పుడు తమిళ,తెలుగు పరిశ్రమలలో హాట్ టాపిక్ ఏమిటంటే...సూర్య నటించిన మాట్రాన్, ప్రియమణి నటించిన చారులత కథ ఒక టేనా..అని. ఎందుకంటే ఈ రెండు సినిమాలూ కూడా అవిభక్త కవలల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నాయి. అయితే చారులత చిత్రం ఎలోన్ అనే థాయిల్యాండ్ చిత్రానికి రీమేక్ అని దర్శకనిర్మాతలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే మాట్రాన్ చిత్రం అమెరికాలో జరిగిన ఒక యదార్థ కథ ఆధారంగా తెరకెక్కించినట్లు దర్శకుడు కె వి ఆనంద్ చెబుతున్నారు. ఎలోన్ చిత్రాన్ని తాను చూశానని ఆ చిత్రానికి, మాట్రాన్ చిత్రానికి సంబంధం ఉండదని ఆయన అంటున్నారు.

    మాట్రాన్ విషయానికి వస్తే..వరుస విజయాలతో ప్రముఖ యువ హీరోల వరుసలో ముందున్న సూర్య అవిభక్త కవలలుగా నటించిన చిత్రం మాట్రాన్. హిట్ చిత్రాల దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కల్పాతి అఘోరం నిర్మిస్తున్నారు. ఉత్తమ నిర్మాణ విలువలతో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రం పలు విశేషాలను సంతరించుకుంది. అయన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత సూర్య కెవి ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం మాట్రాన్. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మాట్రాన్ అక్టోబర్ 12న విడుదల కానుంది.

    మాట్రాన్ కథ .. అవిభక్త కవలలుగా పుట్టిన యువకుల జీవితంలో జరిగే ఆసక్తికరమైన సంఘటనలు, ఎదురయ్యే సంకట పరిస్థితులు, వినూత్న అనుభవాల సమాహారమే మాట్రాన్ చిత్రం అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇంతవరకు ఎవరూ చెప్పని ఒక సందేశాన్ని ఈ చిత్రం ద్వారా తెలపనున్నట్లు అంటున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందంతో కూడిన అభినయం, హరీష్ జయరాజ్ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణ కాగలవంటున్నారు. మాట్రాన్ చిత్ర షూటింగ్‌ను మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రాంతాలతో పాటు లాటేరియా (రష్యా), బాల్గన్ దేశాల్లోనూ చేశారు. స్వదేశీ సాంకేతిక నిపుణులతో పాటు విదేశీ నిపుణులు మాట్రాన్ కోసం పని చేశారు.

    ఇక చారులత ఈ వారంలో తెరపైకి రానుంది. ప్రియమణి అవిభక్త కవలలుగా నటించిన చిత్రం చారులత. కన్నడంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన ద్వారకేష్ ఫిలింస్ సంస్థ కన్నడం, తమిళం భాషల్లో నిర్మించిన ఈ చిత్రంపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్ర విజ యంపై ఎంత నమ్మకం లేకపోతే దీన్ని తెలుగులో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, తమిళంలో సాక్సే పిక్చర్స్, మలయాళంలో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయడానికి ముందుకొచ్చాయి.

    English summary
    KV Anand said his movie was in no way similar to ‘Charulatha’ which features actor Priyamani in a similar role. “After reading such reports, I watched the original version. There isn’t any connection between the two movies except for the fact that the protagonists are conjoined twins.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X