సూర్య ఏం రక్షించబోతున్నాడో ఇప్పుడే చెప్పలేం..బ్లాక్ బాస్టర్ కాంబినేషన్!
తమిళ హీరో సూర్య, దర్శకుడు కెవి ఆనంద్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వీడోక్కడే, బ్రదర్స్ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు ఆడియన్స్ ని మెప్పించాయి. ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో చిత్రం రాబోతోంది. ఈ విషయాన్ని దర్శకుడు కెవి ఆనంద్ దృవీకరించారు. వీరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలకు హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి కూడా అతడే సంగీతం సమకూర్చబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం గురించి కెవి ఆనంద్ మాట్లాడారు. సూర్య పాత్ర గురించి ఇప్పుడే ప్రస్తావించడం తగదు అని అన్నారు. కానీ ఈ చిత్రమో సూర్య ఈ చిత్రంలో రక్షకుడిగా కనిపిస్తాడని, అతడి ఏం రక్షించబోతున్నాడు అనేది మాత్రం సినిమా పూర్తయ్యాక మాత్రమే తెలియనుందని ఆనంద్ అన్నారు.

సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్ జి కె చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక కెవి ఆనంద్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











