»   » హీరోల కన్నా కథే ముఖ్యం అని తేల్చి చెప్పింది

హీరోల కన్నా కథే ముఖ్యం అని తేల్చి చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : హీరో ఎవరనే విషయాన్ని పట్టించుకోను. దర్శకుడు, కథే నాకు ముఖ్యం. అజిత్‌, విజయ్‌ సరసన కనిపించేందుకు ఇంకా కొంచెం సమయం పడుతుంది. నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. స్టార్ హీరోలు కాదు...చక్కటి కథే ప్రధానం అని చెప్తోంది లక్ష్మీ మీనన్.

బెల్లంకొండ సురేష్ నిర్మించిన గజరాజు చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమైన ముద్దుగుమ్మ లక్ష్మి మీనన్. తమిళ చిత్ర పలోకి రివ్వున దూసుకొచ్చిన ఈ యువనటి ఫుల్ బిజీగా ఉంది. 'సుందరపాండియన్‌' కూడా సూపర్ హిట్టవటంతో ఆమెకు తిరుగులేకుండాపోయింది. తొలి చిత్రంతోనే సంచలన నటిగా పేరు తెచ్చుకుంది.

తన ఐడిల్ హీరోయిన్ గురించి చెప్తూ... నయనతార. ఆశ్చర్యంగా ఉందా? నేను చెబుతున్నది నిజం. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ఆమెకే పేరుంది. చిన్న వయసులోనే అన్ని సవాళ్లను ఎదుర్కొంది. వాటన్నింటిని ఛేదించుకుని మళ్లీ చేతినిండా అవకాశాలు అందుకుంది. అనుష్క, త్రిష, హన్సికలన్నా ఇష్టమే. కెరీర్‌ ప్రారంభంనుంచి నేటి వరకు త్రిష మార్కెట్‌ స్థిరంగా ఉంది. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది అని చెప్పింది.


తనకు నచ్చిన హీరో గురించి చెప్తూ...నాకు నచ్చిన హీరో ఎవరంటే సూర్య. ఒక్కో చిత్రంలో ఆయన చూపే ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. సూర్యతో నటించే అవకాశం వస్తే కాల్షీట్‌ కేటాయించేందుకు సదాసిద్ధం అని ప్రకటించింది.


గ్లామర్‌ పాత్రల్లో నటించే విషయం చెప్తూ... సుందరపాండియన్‌', 'గుమ్కీ' కథల్లో భాగంగా లంగా, ఓణీలో కనిపించాను. నిజానికి నాకు ఆధునిక దుస్తులంటే చాలా మక్కువ. 'కుట్టిపులి'లో మళ్లీ లంగా ఓణీతోనే నా పాత్ర సాగింది. గౌతమ్‌ కార్తీక్‌కు జంటగా వస్తున్న 'సిపాయి'లో ఆధునిక దుస్తుల్లో కనిపించనున్నాను. 'గుమ్కీ', 'కుట్టిపులి'తో హ్యాట్రిక్‌ విజయాలు అందుకుంది. ప్రస్తుతం గౌతమ్‌ కార్తీక్‌కు జంటగా 'సిపాయి'తో పాటు మరికొన్ని చిత్రాల్లో కనిపించనుంది.

English summary
Lakshmi Menon has had a wonderful beginning in Tamil films. The Kerala-born actress debuted as heroine in Kollywood with last year’s Sundarapandian opposite Sasikumar. She was also debutant Vikram Prabhu’s heroine in Prabhu Solomon’s Kumki, which met with super success at the box-office besides winning appreciation from critics. Starring in back-to-back hit films at the very beginning can do wonders to the career of anyone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu