For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్‌ పరువు తీసిన నటి.. వేరే వాళ్ల దొడ్లు కడుగుతూ, గిన్నెలు తోమడం కూడా ఒక బ్రతుకేనా?

  |

  రియాలిటీ షోలలో రారాజైన బిగ్ బాస్ షో ఇప్పుడు భాష బేధం లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ షో అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాంట్రవర్సీలో ఇరుక్కోవడం బిగ్ బాస్ కి మొదటి నుంచి అలవాటే. ఇక కొందరు స్టార్స్ కూడా బిగ్ బాస్ అంటే చాలా చిన్నచూపు చూస్తారు. వెళ్లి అక్కడ పరువు తీసుకోవడం కంటే బయట సీరియల్స్ చేసుకోవడం బెటర్ అన్న హీరోయిన్స్ కూడా ఉన్నారు.

  Recommended Video

  #Lakshmi Menon Angry On Bigg Boss Show
  స్టార్ట్ కూడా కాలేదు.. అప్పుడే రచ్చ మొదలైంది

  స్టార్ట్ కూడా కాలేదు.. అప్పుడే రచ్చ మొదలైంది

  మరికొందరైతే షార్ట్ ఫిలిమ్స్ లో అయినా నటిస్తాము గాని బిగ్ బాస్ లోకి వెళ్లి వెట్టి చాకిరి చేయలేమని చెప్పేశారు. ఇక లేటెస్ట్ గా తెలుగులో బిగ్ బాస్ షో మంచి రెంటింగ్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బయట నుంచి ఎవరు కూడా ఈ షోపై కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేయలేదు. షోలో ఎంత రచ్చ కొనసాగుతున్న కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక తమిళ్ లో స్టార్ట్ కూడా కాలేదు కానీ అప్పుడే కొందరు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

  బిగ్ బాస్ 4 పరువు తీసేసిన హీరోయిన్

  బిగ్ బాస్ 4 పరువు తీసేసిన హీరోయిన్

  ఇక కోలీవుడ్ లో ఇప్పుడిపుడే టాలెంటేడ్ నటిగా క్రేజ్ పెంచుకుంటూ వెళుతున్న లక్ష్మీ మీనన్ కూడా బిగ్ బాస్ పై ఊహించని విధంగా కామెంట్స్ చేసి పరువు తీసేసింది. గత కొన్ని రోజులుగా కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ 4 తమిళ్ షోలో కంటెస్టెంట్స్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు టాక్ అయితే వస్తోంది. ముఖ్యంగా అందులో లక్ష్మీ మీనన్ కూడా ఉన్నట్లు టాక్ రాగా ఆమె ఒక్కసారిగా సీరియస్ అయ్యింది.

  ఇతరుల మరుగుదొడ్లు కడగాలా?

  ఇతరుల మరుగుదొడ్లు కడగాలా?

  లక్ష్మీ మీనన్ కి కోలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. కేవలం ఆమెకు నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళుతోంది. వేదళం సినిమాలో అజిత్ సోదరిగా నటించి భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఆమె పేరు ఉన్నట్లు టాక్ రాగా సోషల్ మీడియాలో ఈ విధంగా వివరణ ఇచ్చింది. నేను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదు, ప్లేట్లు కడగడానికి ఇతరుల మరుగుదొడ్లు కడగాలని అనుకోవడం లేదు. అలాంటి దుస్థితి కూడా పట్టలేదని బిగ్ బాస్ పరువు తీసేసింది.

  ఇలాంటి పనికిమాలిన రూమర్స్ వద్దు

  ఇలాంటి పనికిమాలిన రూమర్స్ వద్దు

  ఆ షోలో కెమెరా ముందుకు వెళ్లి ఫేమస్ కొసం పాకులాడే ఆలోచన కూడా తనకు ఏ మాత్రం లేదని అదొక షీట్ షో అని లక్ష్మీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కేవలం రూమర్స్ వస్తేనే ఈ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చిందంటే బిగ్ బాస్ యాజమాన్యం ఆమెను సంప్రదించడానికి వెళితే ఇంకా ఏ స్థాయిలో షాక్ ఇచ్చేదో అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా తనపై ఇలాంటి పనికిమాలిన రూమర్స్ క్రియేట్ చేయవద్దని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది.

  బిగ్ బాస్ షోను అడ్డుకుంటా.. హీరోయిన్ శపథం

  బిగ్ బాస్ షోను అడ్డుకుంటా.. హీరోయిన్ శపథం

  ఇక మరోవైపు మీరా మిథున్ కూడా బిగ్ బాస్ ని అడ్డుకుంటానని శపథం చేస్తోంది. తనకు గత బిగ్ బాస్ సీజన్ లో అన్యాయం జరిగిందని చేరన్ అనే దర్శకుడు తప్పుగా ప్రవర్తించాడని అసలైన వీడియోను బయటపెట్టే వరకు బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ చేయడానికి వీలు లేదని మీరా మిథున్ హెచ్చరించారు. కమల్ హాసన్ కావాలని తన కెరీర్ ని దెబ్బ తీసేందుకు ప్రవర్తించారు కాబట్టి ఆయన కూడా వివరణ ఇవ్వాలని లేకపోతే బిగ్ బాస్ ను అడ్డుకోవడానికి ఎంత దూరమైనా వెళతానని మీరా వివరణ ఇచ్చింది.

  English summary
  Kamal Haasan has successfully completed the last three seasons as a bigg boss host. Controversial beauty Mira Mithun gave a sudden shock as she was getting ready to start the next four seasons at the same level. Kamal Haasan is also making various allegations and commenting that he will definitely block the show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X