»   » తల్లి పాత్రలకు రెడీ అయిన యంగ్ హీరోయిన్

తల్లి పాత్రలకు రెడీ అయిన యంగ్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరస ఫ్లాఫుల్లో మునిగి తేలుతున్న స్నేహకు అస్త్తిత్వమే సమస్యగా మారినట్లుంది. ఎలాగోలా కెరీర్ కొనసాగి ఇండస్ట్రీలో ఉంటే తర్వాత హీరోయిన్ గా ట్రై చేయవచ్చు అనే నిర్ణయానికి వచ్చినట్లుంది. తాజాగా షికార్ అనే మళయాళ చిత్రంలో ఆమె తల్లి పాత్రకు కమిట్ అయింది. యుక్త వయస్సులో ఉన్న కూతురు భాధ్యతలు భరించాల్సిన క్యారెక్టర్ అది. మొదటి ఆ పాత్రకు లక్ష్మీ రాయ్‌ ని సంప్రదిస్తే సారీ...నేను తల్లిగా కనిపించలేను అంటూ చిత్రాన్ని వదులుకొందట. స్నేహ మాత్రం కాదనకుండా అవకాశాన్ని గ్రాబ్ చేసింది. అయితే తాను పాత్ర చేయటానికి కారణం మోహన్ లాల్ అంటోంది స్నేహ. ఆయన తన భర్తగా చేస్తూండటంతో మిగతావన్నీ ప్రక్కన పెట్టి ఆపాత్ర కమిటయ్యానని,తాను మొదటినుంచీ క్యారెక్టర్స్ కే ప్రయారిటీ ఇస్తానని చెప్తోంది. ఇక ఆమె చేసిన 'కర్తవ్యం' రీమేక్ భవాని ఐపీయస్ ఫ్లాప్ కావటంతో ఆమె నిరాశలోకి వెళ్ళే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu