»   »  పార్టీలో మునిగి తేలిన శింబు, లక్ష్మీరాయ్, పివిపి!

పార్టీలో మునిగి తేలిన శింబు, లక్ష్మీరాయ్, పివిపి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సందర్భంగా ఏదయినా అయినా పార్టీ చేసుకోవడం ఈ మధ్య సినిమా సర్కిల్‌లో కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమాలు హిట్టయినపుడు యూనిట్ సభ్యులు, సినీ సర్కిల్‌లోని ప్రెండ్స్ కలిసి పార్టీ చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా మే 9న విడుదలైన తమిళ మూవీ 'వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం' బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించడంతో యూనిట్ సభ్యులంతా పార్టీలో మునిగి తేలారు.

ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. ఈ సంతోషకరమైన మూమెంట్స్‌ను లక్ష్మీరాయ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా ఆమె పోస్టు చేసారు. 'సినిమా ఫ్రెండ్స్ అందరం కలిసాం. సక్సెస్ పార్టీని బాగా ఎంజాయ్ చేసాం' అని లక్ష్మీరాయ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

Lakshmi Rai Parties With VPA Team

'వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం' సినిమా విషయానికొస్తే తెలుగులో హిట్టయిన 'మర్యాద రామన్న' చిత్రానికి తమిళ రీమేక్. సంతానం, ఆశ్నా జవేరి జంటగా నటించారు. ప్రసాద్ వి పొట్లూరి, సంతానం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రానికి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.

తెలుగు వెర్షన్‌కు రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్‌కు శ్రీనాథ్ దర్శకత్వం వహించారు. నాగినీడు, రవిప్రకాష్, విటివి గణేష్, రాజకుమారన్, సెంథిల్ కుమార్, సుగుంతమ్, శ్రీనివాసన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. నిర్మాతలకు ఈ చిత్రం మంచి లాభాలు తెచ్చిపెడుతోంది.

English summary
Vallavanukku Pullum Aayudham, which was released last Friday (May 9), has got good opening at Box Office. It has brought immense joy to the entire team, which marked the occasion by organising a party. Lakshmi Rai was the special attraction of the evening.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu