భూ కబ్జా కేసులో మణిశర్మ.. ఇంటరాగేషన్
వివరాల్లోకి వెళితే...తమిళనాడులోని కణాతూర్ దగ్గర కరూర్ కరుప్పన్ అనే వ్యక్తికి డబ్బై ఐదు సెంట్ల భూమి ఉంది. అయితే తన భూమిపై దర్శకుడు మణిశర్మ హక్కులు కలిగి ఉన్నట్లు కరుప్పన్ కి తెలిసింది. దాంతో అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. భూమికి సంభందించిన పత్రాలు పరిశీలించిన పోలీసులు నకిలీ పత్రాలతో ఆ భూమిపై మణిశర్మ హక్కులు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. మేనేజర్ రఘురామన్ పై ఇప్పటికే విచారణ మొదలైంది. రఘురామన్ తెలిపై వివరాలతో మణిశర్మను కూడా పోలీసుల అదుపులోకి తీసుకుంటారని సమాచారం.
మరో ప్రక్క మణిశర్మ రీసెంట్ గా నిర్మాతగా మారారు. ఆయన ఒక హిందీ సినిమా నిర్మిస్తున్నారు. పాకిస్తానీ నటి వీణామాలిక్‌తో ఆయన 'ముంబయ్ 125 కి.మీ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో విష్ణు హీరోగా 'వస్తాడు నా రాజు' చిత్రానికి దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే ఈ చిత్రానికి హేమంత్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని మణిశర్మ తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ త్రీడి లో రూపొందిస్తున్నారు. ఇదో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. గతంలో హేమంత్ మధుకర్ 'ఎ ఫ్లాట్' అనే హిందీ చిత్రానికి డెరైక్షన్ చేసి ఉన్నారు.


Click it and Unblock the Notifications












