Don't Miss!
- News
రూపురేఖలే మారిపోతున్నాయి - తెలంగాణాలో కొత్త పండుగ..!!
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
స్పృహలోకి వచ్చిన యషికా.. ఆమె మీద మూడు కేసులు, తాగి నడిపిందా?
నటి యాషిక ఆనంద్ ఆదివారం (జూలై 25) అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నటి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ఆమె తన స్నేహితులతో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ వెంబడి ప్రయాణిస్తున్నది. తమిళనాడు పోలీసుల నివేదిక ప్రకారం, ప్రమాదంలో యషికా స్నేహితురాలు వల్లిశెట్టి భవానీ అక్కడికక్కడే మరణించారు. దెబ్బతిన్న కారు యొక్క ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఆమె త్వరగా కోలుకోవాలని యాషిక ఆనంద్ అభిమానులు కోరుతున్నారు. నివేదికల ప్రకారం పోలీసు అధికారులు యషికపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె కారు నడుపుతున్నట్లు చెబుతున్నారు.
ఆమె తాగి బండి నడుపుతోందా అని కూడా వారు పరిశీలిస్తున్నారు. వల్లిశెట్టి భవని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం చెంగల్‌పేట్ ఆసుపత్రికి పంపారు. ఇక అందుతున్న సమాచారం మేరకు యషికా అనంద్ చేయి, పాదం మరియు తుంటిలో పగుళ్లు ఏర్పడినట్టు చెబుతున్నారు. అయితే ఆమెకు కొద్ది సేపటి క్రితం స్పృహ వచ్చిందని అంటున్నారు. ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని అంటున్నారు. నటి యాషిక ఆనంద్‌పై కారు నడపడం, మరణానికి కారణమైందనే ఆరోపణలతో ఆమె మీద నమోదు చేశారు. 279, 337, 304 అనే మూడు సెక్షన్ల కింద అతివేగంగా, ప్రమాదానికి గురిచేసి, మరణానికి కారణమైందనే ఆరోపణలతో కేసు నమోదయింది.

పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ప్రమాద సమయంలో యషికతో పాటు, కారులో మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇక మీటూ క్యాంపెయిన్ సందర్భంగా యశికా ఆనంద్ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేసింది. ఒక దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడని ఆమె చెప్పింది. యషికా తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ మోడల్. ఆమె చాలా చిత్రాలలో సహాయక పాత్రలు చేశారు. యశికా ఆనంద్ బిగ్ బాస్ తమిళ సీజన్ 2 లో కనిపించారు మరియు కొన్ని తమిళ చిత్రాలలో పనిచేశారు. జోంబీ, నోటా, కజుగు 2, ముకుతి అమ్మన్ చిత్రాలలో ఆమె నటించింది.