Just In
- 28 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రజినీకాంత్‌కు భార్య లత ఘన స్వాగతం: ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోన్న ఫొటో
పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆరు పదుల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తున్న ఆయన.. తన అప్‌కమింగ్ మూవీ షూటింగ్ కోసం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. అక్కడ షూటింగ్ జరుపుతోన్న సమయంలో గత శుక్రవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సహాయక సిబ్బంది ఆయనను నగరంలోని అపోలో ఆస్పత్రికి తలించారు. ఆ వెంటనే రజినీకాంత్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన హైబీపీతో బాధ పడుతున్నట్లు నిర్ధారించి చికిత్స ప్రారంభించారు.
శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు హైబీపీకి చికిత్స తీసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రి నుంచి డిచార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. ఆదివారం తన నివాసానికి చేరుకున్న ఆయనకు భార్య లత ఘన స్వాగతం పలికారు. సూపర్ స్టార్ ఇంటికి వెళ్లగానే హారతి పల్లెంతో ఎదురు వచ్చిన ఆమె.. దిష్టి తీసిన అనంతరం ఆయనను లోపలికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా, రజినీకాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న 'అన్నత్తై' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం చిత్ర యూనిట్‌లోని కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వాళ్లను ఆస్పత్రికి తరలించి.. సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అప్పటి నుంచి రజినీకాంత్ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో స్వీయ నిర్భందంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. రజినీ ఆరోగ్య పరిస్థితిపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.