Don't Miss!
- News
నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది ఇందుకే: భగ్గుమన్న బండి సంజయ్
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సినిమాని నిషేధించండంటూ పోలీసులుకు ఫిర్యాదు
చెన్నై : తమిళ చిత్రం 'కాక్కముట్టై' ని నిషేధించాలంటూ అఖిల భారత న్యాయవాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మణివన్నన్ శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 50మంది న్యావాదులతో కలిసి పిర్యాదు చేశారు.
ఇద్దరు చిన్నారులు విఘ్నేశ్, రమేష్ ప్రదాన పాత్రల్లో నటించిన చిత్రం కాక్కముట్టై. ఈ బాల నటులిద్దరూ ఈ చిత్రంలో నటనకుగానూ జాతీయ అవార్డులను అందుకున్నారన్నది గమనార్హం. చిత్రం విడుదలై మూడు వారాలు కావస్తోంది.
విశేష ప్రజాదరణతో ప్రదర్శింపబడుతున్న కాక్కముట్టై చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం కూడ వినోదపు పన్నును రద్దు చేసింది. ఇలాంటి చిత్రంపై ఇప్పుడు నిషేధం విధించాలంటూ న్యాయవాదుల సంఘం పోలీసులను ఆశ్రయించడం విశేషం.

ఆ ఫిర్యాదులో వారు పేర్కొంటూ కాక్కముట్టై చిత్రంలో న్యాయవాదుల్ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు చోటు చేసుకున్నాయన్నారు. ఇదితమ మనోభావాల్ని దెబ్బ తీసే చర్యగా పేర్కోన్నారు. అంతేకాకుండా ప్రజల్లో న్యాయవాదులపై ఏహ్యాభావం కలిగించే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి చిత్రాన్ని వెంటనే నిషేధించాలని కోరారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కాక ముట్టై అంటే.. కాకి గుడ్డు అని అర్థం. గత వారం విడుదలైన ఓ తమిళ చిత్రం పేరిది. పేరుకు చిన్న సినిమానే అయినా.. హీరోలుగా నటించింది ఇద్దరు బాలనటులు... స్టార్ హీరోల సినిమాలు బాక్సాపీస్ బరిలో ఉన్నప్పటికీ.. కోట్ల రూపాయల కలెక్షన్స్ తో కోలీవుడ్ బాక్సాపీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం.
మణికందన్ కథపై నమ్మకంతో తమిళ హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను నిర్మించారు... ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వంటి పాప్యులర్ సంస్థ ఈ సినిమాను పంపిణీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన ఈ సినిమా... రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
చెన్నైలోని ఓ స్లమ్ లో నివసించే ఇద్దరు పిల్లల కథే కాకముట్టై సినిమా. ఆ స్లమ్ కు సమీపంలో కొత్తగా ఏర్పాటుచేసిన పిజ్జా కార్నర్ లో పిజ్జా తినాలనేది వీరి ఆశ. పూట గడవడమే కష్టంగా పేదరికంలో ఉన్న పిల్లలు.. పిజ్జా తినడానికి ఏం చేశారు.. ఎలా తినగలిగారు అనే కథాంశాన్ని హార్ట్ టచింగ్ గా తెరకెక్కించాడు దర్శకుడు. అయితే సినిమాలో పిజ్జా తినడమే పిల్లల కోరిక అయినప్పటికీ.. రియల్ లైఫ్ లో మాత్రం.. ధోనిని కలవాలన్నదే ప్రధాన పాత్రలు పోషించిన విఘ్నేశ్, రమేశ్ ల ఆశ.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఫాక్స్ స్టార్ సంస్థ ఈ ఇద్దరు చిన్నారులు ధోనిని కలసేందుకు ఏర్పాట్లు చేసి వారిని సర్పైజ్ చేసింది.... సబ్ టైటిల్స్ సహాయంతో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూశానని.. చిన్నారుల యాక్టింగ్ లో ఎనర్జీ లెవల్స్ సూపర్బ్ గా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించాడు ధోని.

ఇక చిన్న సినిమా, గొప్ప హృదయం అంటూ.. ఈసినిమాకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చేశాడు. నాలుగు రోజుల్లోనే నాలుగు కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు పొందటంతో పాటు సెలబ్రిటీలకు తెగ నచ్చేసింది.
పరిశ్రమ వర్గాల అంచనాలను మించి జాతీయ అవార్డును గెలుచుకున్న చిత్రం కాక్కముట్టై. నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాక్కముట్టై. నవ దర్శకుడు మణి కంఠన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విఘ్నేష్, రమేష్ అనే బాలతారలు ప్రధాన పాత్రలు పోషించారు.
పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రాన్ని జూన్ ఐదున తమిళంతో పాటు ఇతర దేశాల్లోనూ భారీ ఎత్తున ఫాక్స్ స్టార్ స్టూడియో విడుదల చేసింది.
జపాన్, సౌత్‌కొరియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కాక్కముట్టై విడదల కానుంది. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని ఒక చిన్న చిత్రం ఇలా అంతర్జాతీయ మార్కెట్‌లోకి వెళ్లడం అరుదైన విషయమే అవుతోంది.