»   » సీన్ రివర్స్ : కొడుకుని కాదని లారెన్స్ తోనే

సీన్ రివర్స్ : కొడుకుని కాదని లారెన్స్ తోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : కల్యాణ్‌రామ్‌ 'పటాస్‌'ని సూపర్‌ గుడ్‌ ఫిల్మ్‌ సంస్థ తమిళంలో తీస్తోంది. అందులో హీరోగా చేస్తున్నాను అంటున్నారు లారెన్స్. ఇంతకు ముందు సూపర్ గుడ్ చౌదరి కుమారుడు హీరో జీవా తో ఈ చిత్రం రీమేక్ అనుకున్నారు. అయితే ఇప్పుడు లారెన్స్ కు గంగ తో వచ్చిన క్రేజ్ తో సీన్ మారింది. సీన్ లోకి జీవా ప్లేస్ లోకి లారెన్స్ వచ్చి చేరారు. లారెన్స్ ...డైరక్షన్ చేసినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఓనర్ ఆర్.బి చౌదరి ఈ చిత్రం రైట్స్ ని 63 లక్షలుకు సొంతం చేసుకున్నారు. అలాగే జీ తెలుగు వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ నాలుగుకోట్ల 30 లక్షలుకు కొన్నారు. ఈ చిత్రం కన్నడ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైపోయాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మంచి లాభం వచ్చినట్లే.


Lawrence Hero In Pataas Remake

కన్నడ రీమేక్ విషయానికి వస్తే...


కన్నడ నిర్మాత ఎస్ వి బాబు ఈ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో పునీత్ రాజకుమార్ నటించే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరలో స్పెషల్ షో చూసి విషయం ఫైనల్ చేస్తారు. పునీత్ కాదనుకుంటే సుదీప్ లేదా దర్శన్ చేసే అవకాసం ఉంది. ఈ చిత్రాన్ని బాబు భారీ బడ్జెట్ తో నిర్మించానికి కన్నడ వెర్షన్ రెడీ చేస్తన్నట్లు తెలుస్తోంది. కన్నడ లోకల్ గా కొన్ని మార్పులు చేస్తారని అక్కడ మీడియా అంటోంది.


చిత్రం కథేమిటంటే....


కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఓ కరప్టడ్ పోలీస్ ఆఫీసర్. కావాలని హైదరాబాద్ ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చిన అతను అక్కడ తన అధికారం ఉపయోగించి... సిటీలో లంచాలు,దందాలు చేస్తూంటాడు. అంతేకాదు హైదరాబాద్ డిజిపి కృష్ణ ప్రసాద్(సాయి కుమార్)కు,పోలీస్ డిపార్టమెంట్ కు శతృవైన విలన్ జీకె(అశుతోష్ రానా)కు తొత్తులా మారతాడు. అయితే అసలు కళ్యాణ్ సిన్హా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు... అతని గతం ఏమిటి...గతంలోని అసలు నిజం తెలిసిన అతను మంచివాడిగా మారి... విలన్ కు ఎలా పటాస్ లా మారి ట్విస్ట్ లు ఇస్తాడు...ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి...సునామీ స్టార్ గా ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


అనీల్ రావి పూడి మాట్లాడుతూ... ''ఒక మాస్‌ కథతో దర్శకుడిగా పరిచయమైతే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది. ఆ విషయంలో వి.వి.వినాయక్‌గారే స్ఫూర్తి. దర్శకుల్లో వి.వి.వినాయక్‌ గారంటే ఇష్టం. ఆయన తీసిన తొలి సినిమా 'ఆది' స్ఫూర్తితోనే నేను 'పటాస్‌'లాంటి ఓ మాస్‌ కథని రాసుకొన్నా.అందుకే ఎన్ని ఇబ్బందులెదురైనా ఎంతో ఇష్టంగా రాసుకొన్న మొదటి కథతోనే సినిమా తీశా'' అన్నారు అనిల్‌ రావిపూడి.


కథ గురించి చెప్తూ... ''ఒక అవినీతి పోలీసు అధికారి కథ ఇది. ఎప్పుడూ వసూళ్ల ధ్యాసలోనే గడిపే ఆ పోలీసు ఎలా మారాడన్నది తెరపైనే చూడాలి. పటాస్‌ అంటే టపాకాయ పేరు. అది చాలా గట్టిగా పేలుతుంది. ఇందులో హీరో పాత్ర తీరు కూడా అలాగే ఉంటుంది. ఈ కథలో వినోదమూ కీలకమే. కల్యాణ్‌రామ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది'' అన్నారు.


తన ప్రస్దానం వివరిస్తూ... ''ఇంజినీరింగ్‌ అయ్యాక దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. సహాయ దర్శకుడిగా, రచయితగా పలు చిత్రాలకు పనిచేశాను. 'శంఖం', 'శౌర్యం', 'దరువు', 'కందిరీగ', 'అలా మొదలైంది', 'మసాలా', 'ఆగడు' తదితర చిత్రాలు రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2012లో పక్కాగా మాస్‌ అంశాలతో కూడిన కథ రాసుకొని కల్యాణ్‌రామ్‌గారికి వినిపించాను. ఆయన అప్పుడు 'ఓం' చేస్తున్నారు. మొదట కథ విన్నాక 'చాలా బాగుంది. వేరే హీరోతో ఈ సినిమా నేను నిర్మిస్తా' అన్నారు. 'ఈ కథలో మీరు నటిస్తే బాగుంటుంది, నన్ను నమ్మండి' అని చెప్పా. దీంతో ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు'' అన్నారు.


సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

English summary
As the Tamil remake rights are acquired by producer RB Chowdary, everyone anticipated that his son, hero Jeeva, will play the lead role, But here is the shocker. Talking about the success of "Ganga" at Telugu box office, dance master Lawrence revealed that his next film is nothing but remake of "Pataas".
Please Wait while comments are loading...