»   » సాంగ్ వీడియో లీక్...అంతా షాక్

సాంగ్ వీడియో లీక్...అంతా షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : పెద్ద హీరోల సినిమాల్లో సీన్స్, పాటలు రిలీజ్ కు ముందే బయిటకు వచ్చేయటం, వాటిని కొంతమంది లీక్ చేయటం చాలా కామన్ వ్యవహారంగా మారిపోతోంది. దాంతో ఇండస్ట్రీ పెద్దలు ఇలా జరిగిన ప్రతీ సారి తలపట్టుకుంటున్నారు. అయితే సమర్దవంతంగా ఆపలేకపోతున్నారు. తాజాగా అటువంటి సంఘటనే రజనీకాంత్ తాజా చిత్రం కబాలికి జరిగి ఇండస్ట్రిని ఆలోచనలో పడేసింది.

రజనీ తాజా చిత్రం కబాలి లోని ఓ రెండు నిముషాల పాటు సాగే వీడియో సాంగ్ అనీఫిషియల్ గా నెట్ లో కనపడే సరికి అందరూ షాక్ అయ్యారు. మలేషియాలో చిత్రీకరించిన పాట ఫుటేజ్ అది. అది వాట్సప్ ద్వారా సర్కులేట్ అయ్యిపోయింది. దాంతో చిత్రానికి సంభందించిన వారు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అభిమానులను ..దయచేసి కబాలి సాంగ్ ని సర్కులేట్ చేయవద్దని చెప్పాల్సి వచ్చింది.

leaked songs of Kabali goes Viral

అంతేనా అక్కడితో ఆగలేదు...ఓ టీవి ఛానెల్ వారు ఆ పాటను అత్యుత్సాహంతో ప్రసారం కూడా చేసేసారు. అలా జరగటం తొలి సారి కాకపోయినా ఇలాంటి వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దర్శక,నిర్మాతల దృష్టి పెట్టాల్సి ఆవశ్యకత ఉంది.

చిత్రం విశేషాల్లోకి వెళితే...

రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కబాలి' . తెలుగులోనూ విడుదల కానున్న ఈ సినిమాకి 'మహదేవ్‌' అనే పేరును నిర్ణయించినట్టు తెలిసింది. రజనీకాంత్‌ ఈ చిత్రంలో మాఫియా లీడర్‌గా, ఆయనకి భార్యగా రాధికా ఆప్టే నటిస్తున్నట్గు తెలిసింది. ఈ చిత్రం కోసం రజనీ తెల్లటి గెడ్డంతో ప్రత్యేకమైన లుక్‌తో కనిపిస్తున్నారు.

leaked songs of Kabali goes Viral

సక్సెస్ ఎలాగైనా కొట్టాలనే లక్ష్యంగా బరిలోకి దిగారు రజనీకాంత్‌. ఇదివరకు చేసిన 'విక్రమసింహా', 'లింగ' చిత్రాలు రజనీకి చేదు అనుభవాల్ని మిగిల్చాయి. ఆ చిత్రాలు అనుకొన్న స్థాయిలో ప్రేక్షకులకు చేరువకాలేకపోయాయి. అందుకే ఈసారి ఎలాగైనా ప్రేక్షకుల్ని అలరించాలన్న లక్ష్యంతో కొత్త దర్శకుడు పి.ఎ.రంజిత్‌ చెప్పిన కథకి ఓకే చెప్పి రంగంలోకి దిగాడు. ఈ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'కబాలి' పేరుతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం మలేషియాలో చిత్రీకరణ జరుగుతోంది.

ఇక 'కబాలి' ఫస్ట్ లుక్ మొన్న వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసారు దర్శక,నిర్మాతలు. ఈ చిత్రం రిలీజ్ ని తమిళ న్యూ ఇయర్ అయిన ఏప్రియల్ 14న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు రజనీకాంత్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
A song from Kabali film was reportedly leaked online and this has shocked the entire crew.The clipping seems to be recorded during the shooting in Malaysia, and has been uploaded online. This song is now going viral in the cyber space.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu