»   » రియలైజ్ అయ్యానంటున్న యంగ్ హీరో...

రియలైజ్ అయ్యానంటున్న యంగ్ హీరో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ మధ్య తన వయసుకు మించిన పాత్రలో నటించటంతో తన సినిమాలు ఆడలేదనే విషయం యంగ్ హీరో భరత్ తెలుసుకున్నారు. ఆ విషయాన్ని ఆయన అభిమానులు స్వయంగా కలిసి మరీ చెప్పారుట. అలాగే ఇకపై అలాంటి పాత్రల్లో నటించవద్దని అభిమానులు ఆయన నుంచి ప్రామిస్ తీసుకున్నారుట. అందుకే తన అభిమానుల సలహాలను పాటించాలని నిర్ణయించుకున్న భరత్‌ ఇకపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారట.ఈ విషయాన్ని రీసెంట్ గా మీడియాతో చెప్పుకొచ్చారు. ఆయన చిత్రాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాయి. మంచి బ్యానర్, స్టార్ కో ఆర్టిస్టులు ఉన్నా ఫలించటం లేదు. సురేష్ కృష్ణ వంటి స్టార్ డైరక్టర్ తో ఆర్ముగం చిత్రం చేసారు. అదీ భాక్కసా ఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. అప్పటికీ బాలీవుడ్లో హిట్టయిన జబ్ వుయ్ మెట్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తే అందులో చేసారు. అదీ అస్సలు వర్కవుట్ కాలేదు.

దాంతో భరత్ పరిశీలన చేసుకోవటం ప్రారంభించారు. ఆయన మాటల్లోనే...అభిమానుల ఆదరాభిమానాలు లేకుంటే ఏ హీరో మన్నలేరు. సినిమాల్లో కొత్తదనం లోపిస్తే ప్రేక్షకులు నిర్ధాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. మా ఉన్నతిని దృష్టిలో పెట్టుకునే అభిమానులు తగిన సూచనలిస్తుంటారు, అలాంటి వాటిలో మంచివి ఆచరించడంతో తప్పులేదని భరత్‌ అంటున్నారు. ఇక ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న తంబిక్కు, ఇంద ఊరు చిత్రం అభిమానులు ఆశించే విధంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ చిత్రాల్లో వారు ఆశించే యాక్షన్‌, ప్రేమ, కామెడీ అన్ని అంశాలు సమపాళ్లలో ఉంటాయన్నారు. పాటల్లో తన డాన్స్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుందనే నమ్మకముందన్నారు. అనంతరం పేరరసు, నవీన్‌ రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో రెండు చిత్రాలు చేయనున్నట్లు వెల్లడించారు. అంటే మొత్తానికి రియలైజ్ అయ్యానని డైరక్ట్ చెప్తున్నారు. దర్శక, నిర్మాతలు ఇది విని ఆయనకు వయస్సు కు తగ్గ పాత్రలు ఇస్తే మేలే..

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu