twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ పరిశ్రమలో మరో విషాదం.. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

    |

    ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బీ కన్నన్ ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కన్నుమూశారు. ఇటీవల ఆయన గుండెకు సర్జరీ జరుగుగా ఆ తర్వాత కోలుకోలేకపోయారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఆయన మృతి సిని ప్రముఖులు, దక్షిణాది సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

    బీ కన్నన్ విషయానికి వస్తే.. లెజండరీ డైరెక్టర్ భీమ్‌సింగ్‌కు కుమారుడు. అలాగే ప్రముఖ ఎడిటర్ బీ లెనిన్‌కు సోదరుడు. బీ కన్నన్ తన కెరీర్‌లో ఎక్కువ సినిమాలు ప్రముఖ దర్శకులు భారతీరాజాతో కలిసి పనిచేశారు. వీరద్దరి కలిసి పనిచేసిన మొదటి చిత్రం నిజల్‌గళ్ కాగా, చివరి చిత్రం బొమ్మలాట్టమ్.

    Legendary Cinematographer B Kannan passed away on June 13th

    భారతీరాజాకు రెండు కళ్లుగా బీ కన్నన్‌ను సినీ వర్గాలు పేర్కొనడం విశేషం. బీ కన్నన్ తన కెరీర్‌లో మొత్తం 50 సినిమాలు చేస్తే.. దాదాపు 40 సినిమాలు భారతీరాజాతోనే చేశారు. ఆయన బాఫ్టా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు హెచ్‌వోడిగా 2015 వరకు పనిచేశారు.

    బీ కన్నన్ మరణం గురించి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. బీ కన్నన్‌కు ఇటీవల వడపళనిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గుండెకు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. జూన్ 13వ తేదీన ఆయన మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మరణించారు అని తెలిపారు.

    బాఫ్టా తరఫున డాక్టర్ ధనుంజయన్ సంతాపం ప్రకటిస్తూ.. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ బీ కన్నన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆ వార్తను తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. ఓ అద్భుతమైన వ్యక్తిని, ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించే మనిషిని మనం కోల్పోయాం అని తన ప్రకటనలో పేర్కొన్నారు.

    English summary
    B Kannan passed away on June 13th. Bofta share the news that, Very sad to report the passing away of Legendary Cinematographer #BKannan sir, who worked in more than 50 films (40 films with offBharathiraja sir). He was HoD at BOFTAindia for Cinematography. Very sad we lost such a jovial & wonderful person from our team. #RIP Kannan sir🙏🙏
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X