»   » రజనీ ఇంటిముందు బిచ్చమెత్తబోతున్న డిస్ట్రిబ్యూటర్స్

రజనీ ఇంటిముందు బిచ్చమెత్తబోతున్న డిస్ట్రిబ్యూటర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఓ భారీ చిత్రం ఫెయిల్యూర్ అనేక తలనొప్పులను తీసుకు వస్తుంది. రీసెంట్ గా ...సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ' సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా వల్లా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది నష్టపోయారు. తమకు నష్టపరిహారం ఇవ్వమని వారు చాలా కాలంగా కోరుతున్నారు. ఈ మేరకు నిర్మాతతో చర్చలు సైతం జరిగాయి..జరగుతున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కానీ ఈ చర్చల్లో చివరగా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తాను 10% మాత్రమే వెనక్కి ఇస్తానని చెప్పడంతో వారు మళ్ళీ ఎదురు దాడికి దిగారు. అందుకే ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి సరికొత్తగా వారి నిరసనలు తెలియజేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకే వీళ్ళందరూ రజినీకాంత్ ఇంటివద్ద, లింగా థియేటర్స్ ముందు బిక్షం ఎత్తుకోవాలని నిర్ణయించుకున్నారు.


‘Lingaa’ distributors’ protests take a desperate turn

వారంతా సమావేశమయ్యి... ఇక నుంచి రజినీకాంత్ ఇంటి ముందు బిక్షాటన చేయాలని, అలాగే ఏ ఏ థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసారో అక్కడ రోజు అడుక్కోవాలని వారు నిర్ణయించుకున్నారు.


అంతే కాకుండా ప్రతి సినిమా థియేటర్లో ఒక బిక్షం ఎత్తుకునే ఒక బౌల్ పెట్టి అందులో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ వీలైనంత దానం చెయ్యాలని కోరటం. వాళ్ళు ఇచ్చే డబ్బు మా రికవరీకి కొంతైనా హెల్ప్ అవుతుందని వారు అంటున్నారు. మరి డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


ఇంతకు ముందు జరిగిందేమిటంటే...


'లింగ' చిత్ర విడుదలైన వెంటనే 'బాగా ఆడటంలేదని' ప్రచారం చేసినందువల్లే కలెక్షన్లు తగ్గాయని ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ తెలిపారు. ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు చెన్నైలో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో.. రాక్‌లైన్‌ వెంకటేశ్‌ మీడియాతో సమావేశమయ్యారు.


‘Lingaa’ distributors’ protests take a desperate turn

ఈ విషయమై ఆయన స్పందిస్తూ.. 'ఎలాంటి సినిమా అయినా విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే కొంటాం. ఏ సినిమాకైనా రెండోవారం నుంచి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. కానీ సినిమా తెరపైకి వచ్చిన నాలుగోరోజే సింగారవేలన్‌ అనే డిస్ట్రిబ్యూటర్‌ మీడియాతో మాట్లాడి కలెక్షన్లు లేవని ప్రచారం చేశారు. రజనీని కించపరిచేలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. 'లింగ' చిత్రం వల్ల జరిగిన నష్టాన్ని సరిచేద్దామనే అనుకుంటున్నాం. కానీ సింగారవేలన్‌ తీరు మమ్మల్ని బాధ పెట్టింది.


'చెంగల్పట్టు వంటి ప్రాంతాల్లో కలెక్షన్లు తగ్గిన మాట వాస్తవమే. అలాంటి వారిని పిలిచి నష్టపరిహారం చెల్లించాలనే నిర్ణయించుకున్నాం. కానీ కొందరు నిర్మాతలు ఫోన్‌ చేసి అలా అలవాటు చేయొద్దని అంటున్నారు. దీనిపై సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెంకటేష్‌ చెప్పారు. అనంతరం అమ్మా క్రియేషన్‌ శివ మాట్లాడుతూ.. చెంగల్పట్టు, తిరునెల్వేలి, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదని అన్నారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్లతో సంక్రాంతి తర్వాత మాట్లాడుతామని చెప్పారు.


ఈ సందర్భంగా సింగారవేలన్‌ మాట్లాడుతూ.. రజనీకాంత్‌ నటించిన 'లింగ' చిత్రాన్ని తిరుచ్చి, తంజావూర్‌ జిల్లాల్లో తమ సంస్థ విడుదల చేసిందని అన్నారు. సాధారణంగా రజనీకాంత్‌ చిత్రానికి ఈ ప్రాంతంలో రూ.7 కోట్ల వరకు కొనుగోలు చేస్తామని, అయితే ఈ సినిమా ఐదు రోబో', పది పడయప్పా' చిత్రాలకు సమానమని వేందర్‌ మూవీస్‌ చెప్పడంతో దీన్ని రూ.8 కోట్లకు కొన్నామని అన్నారు. అయితే ఈ సినిమా బుధవారం వరకు రూ.4.20 కోట్లు మాత్రమే వసూలు చేసిందన్నారు. తమకిచ్చిన కమీషన్‌ పోగా.. రూ.5.4 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.


‘Lingaa’ distributors’ protests take a desperate turn

సాధారణంగా ఐదుగురు వచ్చినా సినిమాను నడుపుతామని అయితే బుధవారం ముగ్గురే రావడంతో ఉదయం ప్రదర్శనను ఆపేశామన్నారు. వేందర్‌ మూవీస్‌ సంస్థను తమకు నష్టపరిహారం చెల్లించమని అడిగితే తమకే రూ.15 కోట్ల వరకు నష్టమొచ్చింద'ని చెబుతున్నారన్నారు. రజనీకాంత్‌ తన డబ్బులిస్తారని తాము ఎదురుచూడటం లేదని, ఆయన జోక్యంతో ఈ సమస్యకు ఓ పరిష్కారం వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు.


చిత్రం కథేమిటంటే...


లింగా(రజనీ) ఓ చిన్న దొంగ...అతని ఫ్రెండ్స్(సంతానం)తదితరులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూన్న అతన్ని పబ్లిక్ టీవి రిపోర్టర్ లక్ష్మి(అనుష్క) ఓ సారి జైలు నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అయితే ఓ కండీషన్ పెడుతుంది..అదేమిటంటే... శింగనూర్ అనే ఓ గ్రామం వచ్చి అక్కడ అతని తాతగారు రాజా లింగేశ్వర(ఇంకో రజనీ) కట్టించిన గుడిని ఓపెన్ చెయ్యాలని. అయితే మొదట లింగా రిజెక్టు చేస్తాడు...తమని ఈ దొంగతనాలు చేసే స్ధితికి వెళ్ళేలే చేసి, దరిద్రంలో వదిలిన తమ తాత అంటే అసహ్యమని చెప్తాడు.


అయితే తప్పని సరి పరిస్దితుల్లో అక్కడికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి తాతగారు(కె. విశ్వనాధ్) ఆ గుడి గురించి ఓ రహస్యం చెప్తాడు. అది విన్న లింగా ఆ గుడిని ఓపెన్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే లోకల్ ఎంపి నాగ భూషణం(జగపతిబాబు) అతనో దొంగ అని కుదరదంటాడు. ఈ లోగా లింగా తన తాతగారి గురించి ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు.


ఆయన గద్వాల్ రాజా లింగేశ్వరావు అని... ఆ రోజుల్లోనే(1940) కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ ఇంజినీంరు అని, మధురై కలెక్టర్ అని అర్దం చేసుకుంటాడు. అంత గొప్ప తన తాత తాము ఎందుకు ఇలా దరిద్రంతో బ్రతకాల్సి వస్తోంది. ఆ గుడికి ఉన్న రహస్యం ఏమిటి...ఇంతకీ తన తాత కట్టించిన డ్యామ్ గురించి అతను ఏం తెలుసుకున్నాడు..ఏం చేసాడు...మిగతా విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.


సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా చేసారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

English summary
‘Lingaa’ distributors have now decided to go on a begging protest in front of Rajinikanth’s house and also at the theaters in which ‘Lingaa’ was screened.
Please Wait while comments are loading...