For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ధియోటర్లో మరీ ముగ్గురు...షో ఆపేసాం

  By Srikanya
  |

  చెన్నై : రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రం వివాదం చిరిగి చేట అవుతుందన్న రీతిలో రోజు రోజుకీ పెరిగి పెద్దవుతోంది. 'లింగ' సినిమా వల్ల నష్టపోయినందున పరిహారాన్ని చెల్లించాలని కోరుతూ 10వ తేదీన డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేపట్టనున్నారు. ఈ విషయమై మెరీనా పిక్చర్స్‌ సంస్థ ప్రతినిధి సింగారవేలన్‌, కేప్రికార్న్‌ పిక్చర్స్‌ భాగస్వామి సాయి, చంద్రకళ మూవీస్‌ ప్రతినిధి రూబన్‌ తదితరులు గురువారం చెన్నైలోని ప్రెస్‌క్లబ్‌లో సమావేశమయ్యారు. బుధవారం రోజు మరీ ఈ చిత్రం చూడటానికి ముగ్గురే వచ్చారని షో ఆపేయాల్సి వచ్చిందని అంటున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ సందర్భంగా సింగారవేలన్‌ మాట్లాడుతూ.. రజనీకాంత్‌ నటించిన 'లింగ' చిత్రాన్ని తిరుచ్చి, తంజావూర్‌ జిల్లాల్లో తమ సంస్థ విడుదల చేసిందని అన్నారు. సాధారణంగా రజనీకాంత్‌ చిత్రానికి ఈ ప్రాంతంలో రూ.7 కోట్ల వరకు కొనుగోలు చేస్తామని, అయితే ఈ సినిమా ఐదు రోబో', పది పడయప్పా' చిత్రాలకు సమానమని వేందర్‌ మూవీస్‌ చెప్పడంతో దీన్ని రూ.8 కోట్లకు కొన్నామని అన్నారు. అయితే ఈ సినిమా బుధవారం వరకు రూ.4.20 కోట్లు మాత్రమే వసూలు చేసిందన్నారు. తమకిచ్చిన కమీషన్‌ పోగా.. రూ.5.4 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.

  'Lingaa' in trouble again; distributors and theatre owners complain of losses

  సాధారణంగా ఐదుగురు వచ్చినా సినిమాను నడుపుతామని అయితే బుధవారం ముగ్గురే రావడంతో ఉదయం ప్రదర్శనను ఆపేశామన్నారు. వేందర్‌ మూవీస్‌ సంస్థను తమకు నష్టపరిహారం చెల్లించమని అడిగితే తమకే రూ.15 కోట్ల వరకు నష్టమొచ్చింద'ని చెబుతున్నారన్నారు.

  రజనీకాంత్‌ తన డబ్బులిస్తారని తాము ఎదురుచూడటం లేదని, ఆయన జోక్యంతో ఈ సమస్యకు ఓ పరిష్కారం వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ విషయమై రానున్న 10వ తేదీన తాము ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు.

  చిత్రం కథేమిటంటే...

  లింగా(రజనీ) ఓ చిన్న దొంగ...అతని ఫ్రెండ్స్(సంతానం)తదితరులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూన్న అతన్ని పబ్లిక్ టీవి రిపోర్టర్ లక్ష్మి(అనుష్క) ఓ సారి జైలు నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అయితే ఓ కండీషన్ పెడుతుంది..అదేమిటంటే... శింగనూర్ అనే ఓ గ్రామం వచ్చి అక్కడ అతని తాతగారు రాజా లింగేశ్వర(ఇంకో రజనీ) కట్టించిన గుడిని ఓపెన్ చెయ్యాలని. అయితే మొదట లింగా రిజెక్టు చేస్తాడు...తమని ఈ దొంగతనాలు చేసే స్ధితికి వెళ్ళేలే చేసి, దరిద్రంలో వదిలిన తమ తాత అంటే అసహ్యమని చెప్తాడు.

  అయితే తప్పని సరి పరిస్దితుల్లో అక్కడికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి తాతగారు(కె. విశ్వనాధ్) ఆ గుడి గురించి ఓ రహస్యం చెప్తాడు. అది విన్న లింగా ఆ గుడిని ఓపెన్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే లోకల్ ఎంపి నాగ భూషణం(జగపతిబాబు) అతనో దొంగ అని కుదరదంటాడు. ఈ లోగా లింగా తన తాతగారి గురించి ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు.

  ఆయన గద్వాల్ రాజా లింగేశ్వరావు అని... ఆ రోజుల్లోనే(1940) కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ ఇంజినీంరు అని, మధురై కలెక్టర్ అని అర్దం చేసుకుంటాడు. అంత గొప్ప తన తాత తాము ఎందుకు ఇలా దరిద్రంతో బ్రతకాల్సి వస్తోంది. ఆ గుడికి ఉన్న రహస్యం ఏమిటి...ఇంతకీ తన తాత కట్టించిన డ్యామ్ గురించి అతను ఏం తెలుసుకున్నాడు..ఏం చేసాడు...మిగతా విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

  సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా చేసారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

  English summary
  Less than a month after Tamil superstar Rajinikanth's Tamil film 'Lingaa' hit the screens, several distributors and theatre owners are complaining of huge losses and demanding their money back.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X