»   » రామోజీ ఫిల్మ్ సిటీకి షిప్ట్ అవుతున్న రజనీకాంత్

రామోజీ ఫిల్మ్ సిటీకి షిప్ట్ అవుతున్న రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' చిత్రం ఈ నెల 23వ విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు రజనీకాంత్ హీరోగా 'లింగా' అనే మరో చిత్రం కూడా మొదలైంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న 'లింగా' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మాస్తున్నారు. రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క షెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు

ఇటీవల ఈ చిత్రం మైసూరులో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ ఈ నెల 25వ తేదీ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసారు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన సెట్స్ కూడా రెడీ అయ్యాయి. ఈ మేరకు రజనీకాంత్‌తో పాటు యూనిట్ సభ్యులంతా ఫిల్మ్ సిటీకి షిప్ట్ అవ్వబోతున్నారు.

‘Lingaa’ will be shot at RFC

ఈ చిత్రాన్ని పూర్తికమర్షియల్ ఎంటర్టెనర్‌గా కెఎస్ రవికుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సోనాక్షి సిన్హా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ 'లింగా' చిత్రం స్టోరీలైన్ వెల్లడించింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం 400 ఏళ్ల క్రితం జరిగిన రియల్ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సోనాక్షి ఈ విషయం చెప్పిన వెంటనే కొన్ని రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ చిత్రంలో ముళ్లపెరియార్ డ్యాం ప్రస్తావన ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 400 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్లు కట్టిన ఈ డ్యాం విషయంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. దీంతో 'లింగా' చిత్రానికి సంబంధించిన ఈ వార్త చర్చనీయాంశం అయంది. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

'లింగా' చిత్రానికి రెండుసార్లు ఆస్కార్ అవార్డు సాధించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహ్మాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.కెఎస్ రవి కుమార్, రజనీకాంత్ కాంబినేసన్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. గతంలో రజనీ నటించిన ముత్తు, నరసింహ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన కెఎస్ రవికుమార్...'కొచ్చాడయాన్'చిత్రానికి స్టోరీ కూడా సమకూర్చారు.

English summary
Superstar Rajinikanth’s new film ‘Lingaa’ will be shot from the 25th of this month at RFC . The movie is being directed by K.S. Ravi Kumar and it has Anushka and Sonakshi Sinha as the heroines. Recently, the movie’s shoot commenced in Mysore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu