»   » ఎడిటర్ కి ఛెవర్లెట్ కారుని ప్రెజెంట్ చేసిన దర్శకుడు

ఎడిటర్ కి ఛెవర్లెట్ కారుని ప్రెజెంట్ చేసిన దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ తమిళ దర్శకుడు లింగు స్వామి ఎడిటర్ ఆంధోనికి ఛెవర్లెట్ కారుని ప్రెజెంట్ చేసారు. తమ చిత్రం పయ్యా(తెలుగులో 'ఆవారా')కు అత్యద్బుతంగా ఎడిటింగ్ చేసారని మెచ్చుకుంటూ ఈ బహుమతి ఇచ్చారు. తమన్నా,కార్తీ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రియల్ రెండున రిలీజ్ అవుతోంది.'రన్‌, పందెంకోడి' చిత్రాలతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ఎన్‌.లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన గత చిత్రాలలాగానే ఇందులో లవ్‌ని, యాక్షన్‌ని మిళితం చేసి తీశారు. 'గజిని' సూర్య సోదరుడు కార్తీక్‌ ఈ చిత్రంలో హీరోగా, తమన్నా హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం గురించి లింగు స్వామి....సినిమా టేకింగ్‌ పరంగా వర్మ తరహాలో, కథనం భాగ్యరాజా చిత్రాల తరహాలో ఉంటూ ప్రేక్షకులకు ఆసక్తికలిగిస్తుంది' అని చెప్పారు.

ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే...జీవితంలో ప్రతి విషయాన్ని తెలికగా తీసుకుంటూ, స్నేహితులతో సరదాగా గడిపే ఒక మామూలు యువకడు మొదటి చూపులో ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే విచిత్రంగా, అనుకోకుండా ఎదురైన పరిస్థితుల కారణంగా ఆ అమ్మాయితోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. రోడ్డుపై సాగే ఈ ప్రయాణం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఊహించని మలుపులు, అమ్మాయి ప్రేమను హీరో గెలుచుకున్నాడా, లేదా! ఇలాంటి ఆసక్తికమైన అంశాలతో రూపొందిన చిత్రమే 'ఆవారా'. 'యుగానికి ఒక్కడు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు నిర్మాతగా పరిచయమైన కె.ఇ.జ్ఞానవేల్‌ 'ఆవారా' చిత్రానికి నిర్మాత. గ్రీన్‌స్టూడియో పతాకంపై ఆయనీ చిత్రాన్ని అందిస్తున్నారు. 'ఆవారా' చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా మంచి బాణీలు ఇచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu