twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2.0 బకాయిల వివాదం: సబ్‌టైట్లిస్ట్ ఆరోపణలపై స్పందించిన లైకా

    |

    రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.0 చిత్రానికి సబ్ టైటిల్స్ అందించిన వ్యక్తి చేసిన ఆరోపణలపై లైకా ప్రొడక్షన్స్ స్పందించింది. సబ్‌టైట్లర్ రేఖా హరిచరణ్ మార్కెట్ ధర కంటే ఎక్కువ డిమాండ్ చేశారని, ఆమె సెల్ప్ ఇంట్రెస్ట్‌తోనే ఈ సినిమా కోసం పనిచేసి, ఇపుడు భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది.

    సినీ పరిశ్రమ ప్రమాణాల ప్రకారం సబ్ టైటిల్స్ అందించిన వారికి మేము రూ .50 వేలు చెల్లిస్తాం. అయినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి రూ .1 లక్ష చెల్లించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపింది. కానీ ఆమె సోషల్ మీడియా ద్వారా సంస్థపై ఆరోపణలు చేస్తూ డీఫేమ్ చేసే ప్రయత్నం చేస్తోందని లైకా సంస్థ పేర్కొంది.

     Lyca Productions responded on subtitlist Rekhs allegation

    లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమా స్కేల్, బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిర్మించే ఏ చిత్రమైనా సబ్‌టైటిల్స్ కోసం రూ .50 వేలు కేటాయించడం జరుగుతోంది. ఆమె తనకు తానుగా ఈ సినిమాకు పని చేయడానికి ముందుకు వచ్చారు, డబ్బుల విషయం తర్వాత మాట్లాడుకుందామన్నారు. ఇపుడు రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అంటూ లైకా సంస్థ ఆరోపించింది. మార్కెట్లో ఇంత మొత్తం ఎవరూ ఇవ్వడం లేదు, మేము రూ. 1 లక్ష చెల్లించి ఈ ఇష్యూ సెటిల్ చేసుకోవడానికి సిద్దంగా ఉన్నాము, కానీ ఆమె దీనికి ఒప్పుకోవడం లేదన్నారు.

    2.0 విడుదలైన 10 నెలల తర్వాత కూడా తనకు రావాల్సిన బకాయి చెల్లించడంలో చిత్ర నిర్మాణ సంస్థ విఫలమైంది అంటూ లైకా ప్రొడక్షన్స్ సంస్థపై రేఖా హరిచరన్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Lyca Productions has come out with a clarification over the accusations made by the subtitlist of Rajinikanth's 2.0. In a statement, the company has said that subtitler Rekha Haricharan demanded more than the market price.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X