»   » భర్త కోసం సినీ గేయరచయిత నిరాహార దీక్ష

భర్త కోసం సినీ గేయరచయిత నిరాహార దీక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ సినీ గేయ రచయిత తమరాయ్ తన భర్త కోసం నిరాహార దీక్ష దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె భర్త త్యాగు గత కొన్ని రోజులుగా కనబడకుండా పోయాడు. ఎంతకూ అతని ఆచూకీ దొరకక పోవడంతో చివరకు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఇద్దరి మధ్య కొంత కాలంగా గొడవలున్నట్లు సమాచారం.

తమిళ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం గత రెండేళ్లుగా ఇద్దరి మధ్య సమస్యలున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం త్యాగు జీవితంలో నీ మొహం చూడనని ఆమెకు చెప్పి ఎటో వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. అయితే అతను మళ్లీ తిరిగి వస్తాడని ఇంతకాం ఎదురు చూసిన తమరాయ్, భర్త కోసం ఆందోళకు సిద్దమయ్యారు.

Lyricist Thamarai Protests For Missing Husband

భర్త త్యాగు నివాసం వద్ద తన కొడుకుతో కలిసి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎందకు వచ్చాయి, త్యాగు ఎందుకు ఆమెకు దూరంగా వెళ్లిపోయాడు? ఎక్కడికి వెళ్లాడు? అనే విషయాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇర తమరాయ్ విషయానికొస్తే...తమిళంలో ఆమె ఫేమస్ లిరిక్ రైటర్. గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన చెలి, ఏమాయ చేసావె, సూర్య సన్నాఫ్ క్రిష్ణన్, ఎన్నైఎడిందాల్ చిత్రాలకు పాటలు రాసారు. ఎఆర్ రెహమాన్ ఫేవరెట్ లిరిక్ రైటర్లలో తమరాయ్ ఒకరు. ఏమాయ చేసావె, సూర్యా సన్నాఫ్ క్రిష్ణన్ చిత్రాలకు ఆమె ఫిల్మ్ అవార్డులు సైతం అందుకున్నారు.

English summary
One of the most popular lyricists in Tamil, Thamarai, is on a hunger strike as a protest to find her missing husband Thiyagu.
Please Wait while comments are loading...