మారి 2: నాటీ డాన్‌గా అదరగొట్టిన ధనుష్, సాయి పల్లవి కేక..
ధనుష్ హీరోగా తమిళంలో రూపొందిన 'మారి' అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా రూపొందిన 'మారి 2' డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.
'చావు అంటే భయపడని వాడిని చంపడం కాలా కష్టం.' అంటూ మొదలైన ఈ ట్రైలర్లో ధనుష్ నాటీ డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. 8 సంవత్సరాలుగా ఎవరికీ కనిపించకుండా పోయిన మారి కోసం పోలీసులు, రౌడీలు ఎంత వెతికినా ఆచూకీ తెలుసుకోలేక పోతారు. ఎలాంటి పరిస్థితుల్లో మారి మళ్లీ తిరిగి వస్తాడు? తనను నమ్ముకున్న వారికి ఎలా హెల్ప్ చేస్తాడు అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఆటోడ్రైవర్ పాత్రలో సాయి పల్లవి సినిమాలో కేక పెట్టించే మాస్ పెర్ఫార్ఫెన్స్ ఇవ్వబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. మరో నటి వరలక్ష్మి కీలకమైన పాత్రలో నటిస్తోంది.
బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











