»   » ఇండస్ట్రీ రగిలిపోతోంది: బాహుబలి రైటర్ జీఎస్టీ పై త్యాగం తో నిరసన

ఇండస్ట్రీ రగిలిపోతోంది: బాహుబలి రైటర్ జీఎస్టీ పై త్యాగం తో నిరసన

Posted By:
Subscribe to Filmibeat Telugu

'సేవ్‌ తమిళ సినిమా' అంటున్నారు చెన్నై సినీ జనాలు! సినిమాలపై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ విధించగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వినోదపు పన్ను విధిస్తోంది. అంటే... మొత్తం వసూళ్లలో 58 శాతాన్ని పన్నుల రూపంలో చెల్లించాలన్నమాట. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సినిమా థియేటర్ల యజమానులు బంద్‌ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ కమ్ రైటర్ మదన్ కార్కీ తీసుకున్న ఓ నిర్ణయం ప్రశంసలందుకుంటోంది.

సేవ్‌ తమిళ సినిమా

సేవ్‌ తమిళ సినిమా

సోమవారం తమిళనాడులో సుమారు 1100 థియేటర్ల తలుపులు తెరుచుకోలేదు. పన్ను తగ్గించేవరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఈ బంద్‌కు మద్దతుగా తమిళ చిత్రసీమ గళం విప్పింది. తాజా పరిస్థితులపై తమిళనాడు సినిమాటోగ్రఫీ మంత్రి కడంబూర్‌ రాజుతో సమావేశమైన నటుడు, తమిళ సినిమా నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ పన్ను తగ్గించాలని కోరారు.

ఇండస్ట్రీ అంతా ఒక్కటై... ఒక్క వాయిస్‌ను వినిపిద్దాం

ఇండస్ట్రీ అంతా ఒక్కటై... ఒక్క వాయిస్‌ను వినిపిద్దాం

నటుడు, దర్శక-నిర్మాత కమల్‌హాసన్‌ ‘‘ఇండస్ట్రీ అంతా ఒక్కటై... ఒక్క వాయిస్‌ను వినిపిద్దాం'' అని పిలుపునిచ్చారు. ‘‘48 నుంచి 58 శాతం ట్యాక్స్‌ అంటే టూమచ్‌. సేవ్‌ తమిళ సినిమా'' అని ప్రముఖ దర్శకుడు శంకర్‌ ట్వీట్‌ చేశారు. జీఎస్టీ విషయంలో అక్కడి పరిశ్రమలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

జీఎస్టీపై నిరసన స్వరం

జీఎస్టీపై నిరసన స్వరం

మొత్తం పరిశ్రమ అంతా ఉమ్మడిగా పోరాటానికి కదులుతోంది. ఇప్పటికే థియేటర్లు మూతపడ్డాయి. పరిశ్రమ ప్రముఖులంతా ఏకతాటిపైకి వచ్చిన నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. కమల్ హాసన్.. శంకర్ లాంటి ప్రముఖులు జీఎస్టీపై గట్టిగానే నిరసన స్వరం వినిపించారు. ప్రభుత్వాలతో తాడో పేడో తేల్చుకోవాలన్న భావన అక్కడి సినీ ప్రముఖుల్లో కనిపిస్తోంది.

లిరిసిస్ట్ కమ్ రైటర్ మదన్ కార్కీ

లిరిసిస్ట్ కమ్ రైటర్ మదన్ కార్కీ

ఇలాంటి తరుణంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ కమ్ రైటర్ మదన్ కార్కీ తీసుకున్న ఓ నిర్ణయం ప్రశంసలందుకుంటోంది. జీఎస్టీ కారణంగా నిర్మాతలపై చాలా భారం పడుతున్న నేపథ్యంలో తన పారితోషకాన్ని తగ్గించుకుంటున్నట్లు అతను ప్రకటించాడు. జీఎస్టీపై ప్రభుత్వం ఆలోచన మార్చుకునే వరకు తాను తన రెమ్యూనరేషన్లో 15 శాతం వదులుకుంటున్నట్లు అతను తెలిపాడు.

బాహుబలి' తమిళ వెర్షన్‌కు పాటలు, మాటలు

బాహుబలి' తమిళ వెర్షన్‌కు పాటలు, మాటలు

ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మిగతా టెక్నీషియన్లు.. నటీనటులు కూడా ఇదే బాటలో నడవాలన్న డిమాండ్ కూడా మొదలైంది. లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు తనయుడైన మదన్.. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు సాధించాడు. ‘బాహుబలి' తమిళ వెర్షన్‌కు పాటలు, మాటలు రాసింది మదనే.

కిలికి

కిలికి

బాహుబలి సినిమా కోసం ‘కిలికి' అనే భాషను సృష్టించి దానికి లిపి కూడా రాశాడు మదన్.జీఎస్టీ విషయంలో అక్కడి పరిశ్రమలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం పరిశ్రమ అంతా ఉమ్మడిగా పోరాటానికి కదులుతోంది. ఇప్పటికే థియేటర్లు మూతపడ్డాయి. పరిశ్రమ ప్రముఖులంతా ఏకతాటిపైకి వచ్చిన నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.

సర్వత్రా హర్షం

సర్వత్రా హర్షం

జీఎస్టీ కారణంగా నిర్మాతలపై చాలా భారం పడుతున్న నేపథ్యంలో తన పారితోషకాన్ని తగ్గించుకుంటున్నట్లు అతను ప్రకటించాడు. జీఎస్టీపై ప్రభుత్వం ఆలోచన మార్చుకునే వరకు తాను తన రెమ్యూనరేషన్లో 15 శాతం వదులుకుంటున్నట్లు అతను తెలిపాడు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

English summary
“Until the revision, I am willing to reduce 15% off my remuneration for songs and dialogues, if that would help the industry,” Karky, son of legendary lyricist Vairamuthu said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu