»   »  కోన వెంకట్ సినిమాపై మాధవన్ కంప్లయింట్

కోన వెంకట్ సినిమాపై మాధవన్ కంప్లయింట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nenu Tanu Aame
మాధవన్ హీరోగా సదా,షమితా షెట్టి కాంబినేషన్ లో రచయిత కోన వెంకట్ దర్శకుడుగా మారి రూపొందించిన చిత్రం 'నేను తను ఆమె'. ఈ చిత్రం వర్మ హిందీలో రూపొందించిన డార్లింగ్ చిత్రానికి రీమేక్. ఆ చిత్రం అక్కడ ఫ్లాఫ్ రిపోర్టును తెచ్చుకుంటే ఈ చిత్రం ఇక్కడ చాలా కాలంగా ఆగిపోయింది. అయితే తమిళ,తెలుగు భాషల్లో ప్రారంభమయిన ఈ సినిమా నిర్మాత,దర్శకులకు తలెత్తిన విభేదాల మూలంగానే లేయటనట్లు సమాచారం.

ఇక ఈ చిత్ర నిర్మాతకు మాధవన్ సినిమా రిలీజ్ ఆపమని సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అశోశియేషన్ కి కంప్లైయింట్ చేసాడు. ఆ కంప్లైయింట్ లో Naan Aval Adhu పేరుతో తమిళంలో తయారైన ఈ చిత్రం పేరుతో తనకు దాదాపు 75 లక్షలు దాకా నిర్మాత గౌరవ శర్మ రెమ్యునేషన్ బాకీ ఉన్నాడని పేర్కొన్నాడు. అలాగే మాధవన్ మీడియాతో మాట్లాడుతూ నిర్మాత తనకు గానీ దర్శకుడైన కోన వెంకట్ కూడా చెప్పకుండా ఆడియో పంక్షన్ చేసాడని ఆరోపించాడు. దాంతో ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే సెటిల్ మెంట్ ఒకటే మార్గమని నిర్మాతల సమాఖ్య భావిస్తోంది. అయితే నిర్మాత గౌరవ శర్మ మాత్రం ఎవరికీ అందుబాటులో లేరు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X