»   »  'బాహుబలి' హై కోర్టు తీర్పు‌: ప్రభుత్వానికి సూచన

'బాహుబలి' హై కోర్టు తీర్పు‌: ప్రభుత్వానికి సూచన

Posted By:
Subscribe to Filmibeat Telugu

మదురై: బాహుబలి తమిళ వెర్షన్ లో వాడిన కొన్ని పదాలు దళితలను కించపరిచేలా ఉన్నాయని వివాదం చెలిరేగిన సంగతి తెలిసిందే. దాంతో 'బాహుబలి' సినిమా తమిళ వెర్షన్‌లోని సెన్సార్ బోర్డు తొలగించిన కుల ప్రస్తావన భాగాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ సోమవారం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సినిమాలోని ఒక దళిత కులాన్ని కించపరిచే సంభాషణ ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు స్పందించింది.

ఈ విషయమై ఇంతకు ముందు తమిళనాడులోని మధురై వద్ద పెట్రో బాంబు సైతం ఈ విషయమై పేలింది. దళితులలో ఓ వర్గాన్ని కించ పరిచేలాగ ఉన్న ‘pagadai' అనే పదాన్ని ఉపసంహించుకోవాలంటూ కోరారు. సినిమాలోని ఓ కీలకమైన సన్నివేసంలో ఓ డైలాగులో ఈ పదం వస్తోంది.


ఈ సంఘటన జరగటంతో ...వెంటనే తమిళ మాటల రచయిత మదన్ కార్కే ...క్షమాపణను అఫీషియల్ ప్రెస్ నోట్ ద్వారా తెలియచేసారు. "నేను మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్నా...నేను రాసిన ఓ డైలాగులోని ఓ పదం కొందరు మనో భావాలను దెబ్బ తీసిందని, ఆ పదాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను. ఆ పదం నేను కావాలని రాసింది కాదు. అలాగే అది ఓ కమ్యూనిటికి చెందిన పదమని కూడా తెలియదు. ఆ పదం ఉన్న డైలాగుని తొలిగిస్తున్నాం..ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించండి అన్నారు.


మన సినీ పరిశ్రమలో ఇంతకు ముందేన్నడూ లేని భారీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్‌లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో సెలబ్రెటీలు అంతా ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.


 Madras HC directive to Tamil Nadu govt on 'casteist' Bahubali film dialogue

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెర్షన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఇంటర్నేషనల్ మార్కెట్లో మినిమం వంద కోట్లు సంపాదించాలని టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ప్రేక్షకులు చూడటం కోసం ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.


అలాగే ఆ ప్రేక్షకులను అందుకోవాలంటే... అంతర్జాతీయ నిపుణులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా...హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన Vincent Tabaillon అనే ఎడిటర్ ని ఎంపిక చేసారు


Vincent Tabaillon గతంలో.."The Incredible Hulk", "Clash of the Titans", "Taken 2" and most recently, "Now You See Me" చిత్రాలకు పనిచేసారు. మొదట్లో ఫ్రెంచ్ చిత్రాలకు పనిచేసిన ఆయన ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ఆయన ఎడిట్ చేసే ఈ చిత్రం ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్తుంది. అలాగే ఇక్కడ ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. ఒరిజనల్ చిత్రానికి దీనికి తేడా ఉంటుంది.


చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...


బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు లిఖిస్తూ.. దూసుకుపోతున్న 'బాహుబలి' తెలుగు సినిమాని రూ.400 కోట్ల మైలురాయి దగ్గరకు చేర్చేసింది. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ ఘనత సాధించిన చిత్రంగా 'బాహుబలి' చరిత్ర సృష్టించింది.


మరీ ముఖ్యంగా తొలి వారాంతంలో రూ. 105 కోట్ల షేర్‌ సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'బాహుబలి' జెండా ఎగరేసింది. అంతకు ముందు 'ధూమ్‌' (రూ.100 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్‌' (రూ.99 కోట్లు) రికార్డు 'బాహుబలి' తిరగరాసినట్త్టెంది.

English summary
The Madras High Court on Monday directed government to issue a circular to all District Collectors about the Censor board's decision to remove certain casteist reference in the blockbuster film "Bahubali" so that it was not shown as alleged in some theatres in southern Tamil Nadu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu