twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైకోర్టులో హీరో విశాల్‌కు షాక్.. వెంటనే 15 కోట్లు కట్టాలని ఆదేశాలు.. అసలు ఏమైందంటే?

    |

    హీరో విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు షాకిచ్చింది. లైకా ప్రొడక్షన్‌ సంస్థ వద్ద తీసుకున్న ఋణం అంశం మీద పెట్టిన కేసు విషయంలో విశాల్‌కు కోర్టు షాకిచ్చింది. అసలు విశాల్ లైకా సంస్థ వద్ద ఋణం ఎందుకు తీసుకున్నారు? దానికి కారణం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే

    డబ్బులు డిపాజిట్ చేయాలని

    డబ్బులు డిపాజిట్ చేయాలని

    లైకా సంస్థతో విశాల్ గతంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. ముందుగా చేసుకున్న ఆ ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న 21 కోట్లు చెల్లించకుండానే విశాల్ తన వీరమే వాగై సుడుం అనే సినిమాను రిలీజ్ చేయబోయారు. అయితే ఇదే సినిమాను చిత్రాన్ని తెలుగులో 'సామాన్యుడు'గా విడుదల చేశారు. అయితే ఈ విషయాన్ని ముందు నుంచి గమనిస్తూ వస్తున్న లైకా టీమ్ వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు విశాల్ డబ్బులు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

    మూడు వారాల గుడువు

    మూడు వారాల గుడువు

    ఈ రుణం కేసులో విశాల్‌ రూ. 15 కోట్లు డిపాజిట్‌ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం విశాల్‌కు కోర్టు మూడు వారాల గుడువును ఇచ్చింది. హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును ఈ గడువులో లోపల డిపాజిట్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. తమ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని విశాల్‌ దిక్కరించారని లైకా ప్రొడక్షన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.

    22వ తేదీకి వాయిదా

    22వ తేదీకి వాయిదా


    అలాగే తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.21.69 కోట్ల రుణాన్ని రికవరీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లైకా ప్రొడక్షన్ హౌస్ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చెప్పట్టిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్‌ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్‌ చేయాలని విశాల్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.

    12 కోట్లు తీసుకున్నారని

    12 కోట్లు తీసుకున్నారని

    అయితే విశాల్ మొదట రూ. 12 కోట్లు తీసుకున్నారని, తర్వాత రూ. 3 కోట్లు తీసుకున్నారని, కాబట్టి రూ. 21.29 కోట్ల వడ్డి సరైనది కాదని విశాల్ తరపు న్యాయవాది వాదించారు. కానీ లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్ రూ. 21.29 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అగ్రిమెంట్‌లో ప్రాథమికంగా వెల్లడించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే విశాల్ తరపు న్యాయవాది వాదించిన దానికి అనుగుణంగానే కోర్టు విశాల్‌ను ప‌దిహేను కోట్ల రూపాయ‌లు డిపాజిట్ చేయాల‌ని సూచించింది.

    షూటింగ్ మొదలు

    షూటింగ్ మొదలు

    ఇక విశాల్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయ‌న లాఠీ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. మొన్నీమధ్య ఈ చిత్రంలోని ఓ యాక్షన్ స‌న్నివేశాన్నీ చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ప్రమాదానికి గురైయ్యాడు. ఈ విష‌యాన్ని స్వయంగా విశాల్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయితే ఆ గాయాల నుంచి కేరళ ఆయుర్వేద వైద్యం కారణంగా త్వరగా కోలుకున్నానని హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెడుతున్నానని కూడా విశాల్ వెల్లడించారు.

    English summary
    Madras High Court gives a major shock to Vishal over movie release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X