»   » నాలుగేళ్ల క్రితం మిస్: మహేష్ మూవీ తమిళనాట హాట్

నాలుగేళ్ల క్రితం మిస్: మహేష్ మూవీ తమిళనాట హాట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు సినిమా నాలుగేళ్ల క్రితమే తమిళంలో తెరకెక్కాల్సి ఉంది. అయితే అప్పుడు మిస్సయింది. చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు డైరెక్టు తమిళ సినిమా చేయడం తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. ఆ సినిమా మరేదో కాదు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం'. మహేష్ బాబు చేస్తున్న తొలి తెలుగు-తమిళం బైలింగ్వల్ మూవీ ఇది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పివిపి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే సంస్థ కార్యాలయంలో ప్రారంభోత్సవం జరుపుకుంది. ‘జులై 10 నుండి ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. పి.వి.పి అధినేత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ..‘మా పి.వి.పి సంస్థలో ఇది ఓ ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తాం. ప్రేక్షకుల్లో అభిమానుల్లో జనవరి 8 నుండే ఈ చిత్రం పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. శ్రీకాంత్ అడ్డాల రెడీ చేసిన అద్భుతమైన స్క్రిప్టు ని ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం' అన్నారు.

 Mahesh Babu To Make His Tamil Debut After Missing It Four Years Ago!

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ..‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో మరో మంచి సినిమా చేస్తున్నాము. పి.వి.పి సినిమా వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడైనా నలుగురు ఉన్న చోట ఓ అందం, ఆనందం ఉంటుంది. అలాంటిది అనేక మంది ఒక కుటుంబంలో ఉండి ప్రతి ఓ సందర్భాన్ని ఓ ఉత్సవం జరుపుకునేటట్టు ఉంటే అదే ‘బ్రహ్మోత్సవం' అన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కంప్లీట్ కాస్ట్ ఇంకా ఖరారు కాలేదు. అయితే బాహుబలి చిత్రంలో నటిస్తున్న తమిళ నటుడు సత్యరాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జయసుధ, రావు రమేష్, తనికెళ్ల భరణిలతో పాటు భారీ తారాగణం ఇతర ముఖ్య పాత్రలు పోషించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జే.మేయర్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, ఆర్ట్: తోటతరణి, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

English summary
According to the latest buzz, Telugu star Mahesh Babu will be making his Tamil debut in the movie titled Brahmotsavam opposite Rakul Preet Singh and Pranitha. The film, which is said to be a Tamil-Telugu bilingual will be directed by famed Telugu director Srikanth Addala and will be produced by Prasad V Potluri of PVP Cinemas.
Please Wait while comments are loading...