»   » 'బాహుబలి' తో పోటీనా?: 'శ్రీమంతుడు' తమిళ డబ్బింగ్ రైట్స్

'బాహుబలి' తో పోటీనా?: 'శ్రీమంతుడు' తమిళ డబ్బింగ్ రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్దమవుతోంది. అదే రోజున తమిళంలోనూ విడుదలకు ప్లాన్ చేస్తోంది. ఇదే తొలిసారి రెండు చోట్లా ఒకే సమయంలో రిలీజ్ చేయటం. ఈ చిత్రం తమిళ డబ్బింగ్ రైట్స్ మరియు తెలుగు వెర్షన్ తమిళనాడు రైట్స్ ని ..సత్యం సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు.

ఈ మేరకు ఇప్పటికే డబ్బింగ్ వర్క్ ప్రారంభమైంది. అందుతున్న సమాచారం ప్రకారం...తమిళనాడు లో రెండు వందల థియోటర్లులో రిలీజవుతోంది. ఈ నేపధ్యంలో తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజైన 'బాహుబలి' తో పోటీ వద్దనుకున్నా వస్తోంది. ఈ మేరకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.


"నా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు అదో రకం" అంటూ మహేష్ వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.


'శ్రీమంతుడు' ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదలైన దగ్గరనుంచి బిజినెస్ ఊపందుకుంది. ఈ చిత్రం బిజినెస్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 'శ్రీమంతుడు' ప్రీ రిలీజ్ బిజినెస్ బిజినెస్ : రూ59.6 కోట్లు శాటిలైట్ రైట్స్ తో కలిపి, హిందీ డబ్బింగ్, ఆడియో,మిగతా రైట్స్ కలిపి 75 కోట్లు రీచ్ అవుతాయని అంటున్నారు.


Mahesh's 'Srimanthudu' : Tamil Rights

ఇక శ్రీమంతుడు కొత్త విశేషాలు..


'వూరు దత్తత' అనే అంశానికి నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ చిత్రం బాగా నచ్చుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది. వీలైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసమూ ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకొంటున్నారట.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులకు ప్రత్యేకంగా ప్రదర్శించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. వూరిని దత్తత తీసుకోవాలనే ఓ చక్కటి సందేశం చుట్టూ సాగే కథ ఇది. శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా చేస్తోంది. కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.


చిత్రం కాన్సెప్టు ఏమిటీ అంటే....వూరు చాలా ఇచ్చింది. అందమైన బాల్యాన్ని, మర్చిపోలేని స్నేహాన్నీ, వదులుకోలేని జ్ఞాపకాల్ని. ఇన్నిచ్చిన వూరుకి తిరిగి ఏమిచ్చాం..? రెక్కలొచ్చి వెళ్లిపోయాక.. పండగలకీ పబ్బాలకీ సొంతూరెళ్లి - మహా అయితే సెల్ఫీ దిగొచ్చాం. అంతేగా..? అందుకే.. 'వెలకట్టలేని ఆస్తిని ఇచ్చిన వూరికి మనమూ ఏదోటి తిరిగివ్వాలి..' అని చెప్పడానికి 'శ్రీమంతుడు' వస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి.


మహేష్‌బాబు మాట్లాడుతూ...


''అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. వాళ్ల కోసం మంచి సినిమాలు చేసేందుకే ప్రయత్నిస్తుంటా. పోయినసారి కాస్త నిరుత్సాహపరిచాను. అందులో నా తప్పుంటే క్షమించండి''అన్నారు మహేష్‌బాబు.


మహేష్ కంటిన్యూ చేస్తూ... ''దేవి అంటే నాకు చాలా ఇష్టం. 'జాగో జాగో...' పాట నా కెరీర్‌లోనే ఉత్తమ గీతంగా నిలుస్తుంది. కొరటాల శివ అద్భుతమైన రచయిత. నాకు చెప్పినదానికంటే బాగా తీశాడు. 'శ్రీమంతుడు' లాంటి సినిమా నాతో తీసినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా ఒప్పుకొన్నందుకు జగపతిబాబుగారికి కృతజ్ఞతలు. ఆయన తప్ప మరొకరు సెట్‌ అవ్వని పాత్ర అది. రాజేంద్రప్రసాద్‌గారు, సుకన్యగారు, రాహుల్‌ రవీంద్రన్‌ లాంటి నటులతో కలసి నటించడం చక్కటి అనుభవం. కమల్‌ హాసన్‌గారికి పెద్ద అభిమానిని. ఆయన కూతురితో కలసి సినిమా చేస్తాననుకోలేదు. అభిమానులు ఈసారి నా పుట్టినరోజుకి పెద్ద కానుక ఇస్తారని ఆశిస్తున్నాను''అన్నారు.


దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ...''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.


శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.

English summary
After the success of Baahubali in Tamil, Another biggie getting ready to release in Tamil version. Mahesh Babu’s Srimanthudu going to release in Tamil on the same date i.e., August 7. This is the first simultaneous release for Mahesh Babu. Tamil Version & Telugu Tamilnadu rights bagged by Sathyam Cinemas. Tamil dubbing work going to start soon. As per the early conclusions, Distributors trying to release in more than 200+ screens in Tamilnadu.
Please Wait while comments are loading...