»   » పెళ్ళా..?వరుడు దొరికితే కదా..అప్పుడు చూద్దాం..!?

పెళ్ళా..?వరుడు దొరికితే కదా..అప్పుడు చూద్దాం..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మళయాలీ భామ మమతామోహన్‌ దాస్‌ కు నాగార్జునతో నటించిన 'కేడీ" తర్వాత తెలుగులో అవకాశాలు లేని విషయం తెలిసిందే. ప్రస్తుతం మళయాల, తమిళ చిత్రాల్లో నటిస్తున్న మమత త్వరలో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. తమిళంలో అరుణ్‌ విజయ్‌ తో 'తాడయిర తాక" చిత్రంలో నటిస్తున్న మమత 2012లో పెళ్ళికూతురు కాబోతోంది.

ఇప్పటి నుంచే ఆమె తల్లిదండ్రులు వరుడి కోసం వెతకడం మొదలు పెట్టారట. ఈ విషయాన్నే మమతని అడిగితే 'నాకు అన్ని విధాలా సూటయ్యే వరుడి కోసం మా పేరెంట్స్ వెతుకుతున్నారు. వారికి నేను కోరుకునే అన్ని అర్హతలున్న వ్యక్తి దొరకడం కష్టమే. నాకు తగ్గ వరుడు దొరికితే అప్పుడు చూద్దాం. మా పేరెంట్స్ కోరిక త్వరగా తీరాలని కోరుకుంటున్నాను" అంటూ సెలవిచ్చింది. పైగా తను రెండేళ్ళ తర్వాత చేస్తున్న తమిళ చిత్రం గురించి చెబుతూ 'రెండేళ్ళుగా తమిళ చిత్రంలో నటించలేదు. మంచి కథ కుదరడంతో అరుణ్ విజయ్‌ తో 'తాడయిర తాక" చిత్రంలో నటిస్తున్నా" అని తెలిపింది మమత.

English summary
Mamata Mohandas, who debuted as an actress into Tollywood with the film Yamadonga, is getting ready to settle down in life shortly. Mamata Mohandas is going to getting married in the next year, 2012. As per the sources Mamata’s parents are already started the hunt to find suitable groom for actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu