»   » స్టార్ హీరో సినిమాలో ...ముమ్మట్టి విలన్

స్టార్ హీరో సినిమాలో ...ముమ్మట్టి విలన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ముమ్మట్టి త్వరలో విలన్ గా కనిపించి అలరించనున్నాడా అంటే అవుననే వినపడుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తన 60వ చిత్రంలో ఆయన్ని విలన్ గా బుక్ చేసినట్లు తమిళ సిని వర్గాల సమాచారం. మళయాళ మెగాస్టార్ విలన్ గా నటించటంతో తమిళంలోనే కాక మళయాళంలోనూ ఓ రేంజిలో ఈ సినిమాకు క్రేజ్ వచ్చే అవకాసం ఉంది.

Mammootty To Play Ilayathalapathy Vijay's Villain?

విజయ్‌ 60వ చిత్రం విషయానికి వస్తే... ఈ చిత్రం డైరెక్టర్‌ భరతన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర కథను విజయ్‌ వినడం, ఓకే చెప్పడం వంటివి పూర్తయినప్పటికీ విజయ్‌ చెప్పినట్టు కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. దీంతో భరతన్‌ ఆ పనిలో నిమగ్నమయ్యాడు. ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం ఎంపిక పనులు జోరుగా సాగుతున్నాయి. వీటిని రెండు నెలల్లో పూర్తి చేసి ఏప్రిల్‌ తొలి వారంలోనే విజయ్‌ 60వ సినిమా షూటింగ్‌ పనులు ప్రారంభిస్తామని భరతన్‌ చెబుతున్నాడు.

విజయ్‌ తన భారీ ఫ్లాఫ్ చిత్రం ‘పులి' తర్వాత దాన్ని మరిపించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ కోసం వరస ప్రాజెక్టులు రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రమే కాక...తర్వాత మరో చిత్రం కూడా కమిటయ్యాడు. అది విజయ్ ...60 వ చిత్రం కావటం విశేషం.

Mammootty To Play Ilayathalapathy Vijay's Villain?

‘పులి' తర్వాత రాజు- రాణి.. డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం తెరి. ఈ సినిమాను ఏ మాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా జోరుగా పూర్తి చేశాడు అట్లీ. విజయ్‌ కూడా ఇతర చిత్రాలకు ఇచ్చిన విధంగా గ్యాప్‌ ఇవ్వకుండా వేగంగా ‘తెరి'ని పూర్తి చేశాడు. ‘పులి' విడుదలకు ముందే ‘తెరి' షూటింగ్‌ సగభాగం పూర్తయింది.

అదే స్పీడు కొనసాగడంతో ఇప్పుడు ‘తెరి' చిత్రం షూటింగ్‌ పార్ట్‌ ముగిసింది. దీంతో కొంత గ్యాప్‌ తీసుకుని విజయ్‌ కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు.

English summary
The latest update pertaining to 'Vijay 60' has it that the team is trying its best to rope in Mammootty to play the role of the main antagonist.
Please Wait while comments are loading...