»   » మమతా మోహన్ దాస్ అంత పెద్ద పొరపాటు చేసిందా?

మమతా మోహన్ దాస్ అంత పెద్ద పొరపాటు చేసిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమర్షియల్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియక మంచి కథ కావాలంటూ పొరపాట్లు చేశానని విచారం వ్యక్తం చేస్తోంది మమతా మోహన్ దాస్. నాగార్జున కేడీ తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. అలాగే ఎన్టీఆర్ తో యమదొంగ వంటి చిత్రంలో చేసినా ఆమెకు చెప్పుకోదగిన స్దాయిలో ఆఫర్స్ రాలేదు. అయితే అదంతా తన స్వయంకృతాపరాధమే నంటోంది మమతా.అయితే ఇప్పటికి మించిపోయిందేమీ లేదని ఇక నుంచి కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్రలనే అంగీకరిస్తానని ఆమె అంటోంది. కాబట్టి ఇక దర్శకులూ,నిర్మాతలు మేలుకుని గబగబా మమతాకి కమర్షియల్ హీరోయిన్ అవకాశం ఇస్తారని ఆశిద్దాం. కాగా ప్రస్తుతం మమతా 'ఆదిభగవాన్‌' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. పరుత్తి వీరన్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన అమీర్ ఈ చిత్రానికి ఆమెను ఎంపికచేసుకున్నారు. ఇక ఆ చిత్ర విశేషాలను అమీర్‌ వివరిస్తేనే బాగుంటుందని మమకా చెప్తోంది.కాల్షిట్‌ సమస్యలు ఉండడంతో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌కు హాజరుకాలేకపోయానని, రెండో షెడ్యూల్‌ షూటింగ్‌కు హాజరవుతానని ఆమె అంటోంది. అలాగే ఈ చిత్రంలో జయం రవి హీరోగా చేస్తున్నారు. మొదట నీతూ చంద్రని ఈ పాత్రకు అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేయటం కష్టమని మమతాని తీసుకున్నారని తెలుస్తోంది. మమతా మోహన్ దాస్..ఓ ఎన్నారై పాత్ర చేయనుంది. ఈ సినిమా మమతామోహన్‌దాస్‌కి మంచి పేరు తెచ్చిపెట్టడం ఖాయం అని చెప్పుతున్నారు. ఈ సినిమాపై మమతా మోహన్‌ దాస్‌ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. ఇది గాక మలయాళంలో మరో రెండు చిత్రాల్లో మమతా మోహన్‌ దాస్‌ ప్రస్తుతం నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu