»   »  మహిళా దర్శకరాలు మమతా....

మహిళా దర్శకరాలు మమతా....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kucheludu
మమతా మోహన్ దాస్ డైరక్టర్ అయ్యింది....అదీ దక్షిణాది సూపర్ స్టార్ రజనీ కాంత్ ని డైరక్ట్ చేస్తూ. కాని ఈ సంఘటన ఆమె రియల్ లైఫ్ లోది కాదు...రీల్ లైఫ్ లో జరిగింది . ఆమె ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న 'కుచేలుడు' లో ఈ సన్నివేశం ఉంటుందిట. ఈ సినిమాలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నిజ జీవిత పాత్ర అయిన హీరోగా కనిపిస్తారు. దాంతో ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొనే సీన్లలో ఆయన్ని దర్శకత్వం చేసే దర్శకురాలు గా ఆమె కనిపిస్తుంది.

సాధారణంగా ఆ సినిమా దర్శకులే అటువంటి పాత్రల్లో తళుక్కున మెరుస్తూంటారు. అంటే పి.వాసు లెక్క ప్రకారం ఆ సీనులో కన్పించాలి. కాని ఆయన మమతాని ఎన్నుకున్నారు. అంతేగాక ఆమె ఈ చిత్రం కోసం కుర్రాళ్ళని కిక్కిక్కెంచే ఓ టాప్ సాంగ్ పాడిందిట. మళయాళ సూపర్ హిట్ 'కథా పెరియంబోల్' ఆథారంగా పి.వాసు ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత అశ్వనీదత్ తెలగులో అందిస్తున్నఈ సినిమాలో జగపతి బాబు బార్బర్ గా కథలో కీలకమైన పాత్రని చేస్తున్నాడు. అలాగే హీరోయిన్లు నయనతార, మమతామోహన్ దాస్ తమదైన శైలిలో గ్లామర్ ని పంచనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X