»   » బిగ్‌బాస్‌ హౌస్‌లో సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం.. మరో అనుమానాస్పద మృతి

బిగ్‌బాస్‌ హౌస్‌లో సెలబ్రిటీ ఆత్మహత్యాయత్నం.. మరో అనుమానాస్పద మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో అపశృతి చోటుచేసుకొన్నది. బిగ్‌బాస్ సెట్లో పనిచేస్తున్న ప్లంబర్ మరణించడంతో ఈ షోను మరో వివాదం చుట్టుకొన్నది. మంగళవారం చోటుచేసుకొన్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అంతేకాకుండా ఈ షోలో ఓవియా స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశమైంది. రియాలిటీ షో మొదలైన తర్వాత అనేక వివాదాలు ఈ కార్యక్రమాన్ని చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. తమిళ సంప్రదాయాలకు విరుద్దంగా ఈ కార్యక్రమం సాగుతున్నదనే ఆరోపణలపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

సెట్లోనే కుప్పకూలిన ప్లంబర్

సెట్లోనే కుప్పకూలిన ప్లంబర్

మీడియా కథనాల ప్రకారం.. ముంబైకి చెందిన ఇబ్రహీం షేక్ బిగ్‌బాస్ సెట్లో కొద్దిరోజలుగా పనిచేస్తున్నాడు. అనారోగ్య కారణాల వల్ల సెట్లోనే కుప్పకూలడంతో వెంటనే అత్యవసర వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత కిల్పాక్ మెడికల్ కాలేజీకి తరలించడానికి ప్రయత్నిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస వదిలారు.

పోలీసుల కేసు నమోదు..

పోలీసుల కేసు నమోదు..

ఈ ఘటనపై నజార్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షేక్ అనారోగ్యంగా ఉందని తోటి కార్మికులకు చెప్పాడు. విపరీమైన చెమటలు పట్టి అక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం వివాదంగా మారింది.

 ప్లంబర్ మరణంతో మరో వివాదం

ప్లంబర్ మరణంతో మరో వివాదం

దాదాపు 15 మంది సెలబ్రిటీలు బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. టీవీ, మొబైల్, సోషల్ మీడియా, ఎలాంటి కమ్యునికేషన్ల సౌకర్యం లేకుండా సెలబ్రిటీలు 100 రోజులు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాల్సి ఉంటుంది. వారి కోసం ఇంటి బయట చాలా మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు సేవలందిస్తున్నారు. అలా పనిచేస్తున్న వాళ్లలో ఒకరు మృతి చెందడం మీడియాలో చర్చనీయాంశమైంది.

Bigg Boss Telugu : Mumaith Khan Mouth Shut By Plaster | Filmibeat Telugu
స్విమ్మింగ్ పూల్‌లో దూకిన అవియా

స్విమ్మింగ్ పూల్‌లో దూకిన అవియా

ఇది ఇలా ఉండగా, ఈ షోలో తమ కెమిస్ట్రీతో అదరగొడుతున్న అవియా, ఆరవ్ రొమాంటిక్ డ్రామా కొత్త మలుపు తిరిగింది. గత కొద్దికాలంగా మానసిక సంఘర్షణకు లోనవుతున్న ఓవియా షో నుంచి ఎలాగైనా తప్పుకొనేందుకు ప్రయత్నిస్తుననారు. ఈ నేపథ్యంలో ఇంటి ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించినట్టు సమాచారం. నీటిలో మునిగిన ఓవియాను తోటి సెలబ్రీటీలు బయటకు లాగడంతో ప్రాణాపాయం తప్పింది.

కావాలనే వివాదాలు..

కావాలనే వివాదాలు..

తమిళ బిగ్‌బాస్ కార్యక్రమాన్ని వివాదాలు చుట్టుముట్టడం, అంతేకాకుండా అంతగా ప్రేక్షకుల నుంచి స్పందన రాకపోవడంతో నిర్వాహకులు సెన్సేషనల్‌గా చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమంలో అనే వివాదాస్పద అంశాలు జొప్పిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

బిగ్‌బాస్ నుంచి ఓవియా ఔట్

బిగ్‌బాస్ నుంచి ఓవియా ఔట్

ఓవియా హెలెన్ సూసైడ్‌కు ప్రయత్నించడంతో నిర్వాహకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇంటిలో ఆమెను ఇంకా కొనసాగిస్తే ఇతర సభ్యుల మనోధైర్యం దెబ్బతిని షోకు ముప్పు వాటిల్లే ప్రమాదముందనే భయంతో ఆమెను షో నుంచి తప్పించారు.ఇంటిని విడిచి వెళ్లమని బిగ్‌బాస్ ఆదేశించడంతో ఓవియా హౌస్ నుంచి బయటకు వచ్చింది.

English summary
A plumber working on the sets of Bigg Boss Tamil, hosted by Kamal Haasan, died of a seizure on Tuesday. Report suggest that Ibrahim Shaik, who hails from Mumbai, collapsed on the sets of the show. He was given emergency medical aid before being taken to Kilpauk Medical College (KMC), where he was declared brought dead. Apart from this, celebrity Oviya Helen was desperately trying to walk out of the show. Oviya Oviya jumped into the swimming pool. She was later pulled out of the pool by other housemates.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more