»   »  మణిరత్నం 120 కోట్ల ప్రాజెక్టు..

మణిరత్నం 120 కోట్ల ప్రాజెక్టు..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mani Ratnam
సౌత్ ఇండియన్ చరిత్రలోనే భారీ సినిమాను మణిరత్నం చేయబోతున్నారనే వార్త తమిళ పరిశ్రమను ఆనందపరుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రెడీ అయ్యే ఈ సినిమాకి బడ్జెట్ 120 కోట్ల దాకా ఉంటుందని అంచనా. మణిరత్నం సొంత ప్రొడక్షన్ హౌస్ మద్రాస్ టాకీస్ పతాకంపై నిర్మించబోయే ఈ చిత్రానికి సమర్పకులుగా రిలియన్స్ ఎంటర్ టైన్ మెంట్ బిగ్ పిక్చర్స్ వారు ఉండబోతున్నారు. దీని నిమిత్తమై మణి...అనీల్ అంబానీతో పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు.

వాస్తవానికి ఈ పనులన్నీ గతంలో ఆయన సోదరుడైన జి.శ్రీనివాసన్ చూసుకునేవారు. కానీ ఆయన మరణించటంతో మణిరత్నం ఫైనాన్షియల్ వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి వస్తోంది. ఇక 'గురు' తో పెద్ద సక్సెస్ ని సొంతం చేసుకున్న అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో హీరోగా చేస్తాడని తెలుస్తోంది. ఇక అభిషేక్ హిందీలో చేసే పాత్రను తమిళ,తెలుగు వెర్షన్స్ కు విక్రమ్ ఎంపికయ్యాడు. అలాగే ఐశ్వర్వ రాయ్ ఈ మూడు వెర్షన్స్ కి హీరోయిన్ .ఎప్పటిలాగే ఈ సినిమాకు పి.సి.శ్రీరామ్ ఫొటోగ్రఫి ని అందిచనున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X