»   » దటీజ్ మణి రత్నం..., "చెలియా" టీజర్ హాలీవుడ్ స్ఠాయిలో ఉంది.., అదితి కళ్ళలో పడిపోతారంతే

దటీజ్ మణి రత్నం..., "చెలియా" టీజర్ హాలీవుడ్ స్ఠాయిలో ఉంది.., అదితి కళ్ళలో పడిపోతారంతే

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణి రత్నం ఇండియన్ సెల్యులాయిడ్ మీద ఒక అందమైన సంతకం... ఇద్దరూ, అమృత, బొంబాయి లాంటి సిని మాలన్నీ ఒక ఒక రాజకీయ నేపథ్యాన్నీ, సంక్షోబాన్నీ, ఒక సంఘర్షణ నీ బేస్ గా చేసుకొని రాసుకున్న కథలే.., కానీ అన్ని సినిమాల్లోనూ మణిరత్నం మిస్సవనిది ఒక్కటే హీరోయిన్ ని ఎంత అందంగా చూపించాలో మణి మర్చిపోడు... "ఉరికే చిలకా..." లాంటి సాంగ్ లో పరిగెత్తుకొచ్చే మనీషా కొయిరాలా ఇంకా అలా గుర్తొస్తూనే ఉంటుంది. మణిరత్నం ప్రజెంటేషన్ అలా ఉంటుంది "సఖి" లో షాలిని కళ్ళని, ఆ ఎక్స్ప్రెషన్లనీ ఎప్పటికీ మర్చిపోలేం....

మణిరత్నం ని చాలామందే కొత్త దర్శకులు ఫాలో అయ్యారు ముందు హీరోయిన్ పాదాలు చేతులూ, అలా గాలికి ఎగిరే చున్నీ... అందంగా పెద్ద కళ్ళు సీతాకోక చిలుక రెక్కల్లా రెప్పలార్పటం... ఒక్కసారి ప్రేక్షకున్నిఆ అందం ముందు నిలబెట్టేయటం., యావరేజ్ అనిపిబంచే అందాన్ని కూడా అతిలోక సుందరం అనిపించేలా చేయటం మణి ఒక్కడికే సాధ్యం అన్నట్టు అయిపోయింది.

ఎన్నో ఏళ్ళక్రితం వచ్చిన "గీతాంజలి" కూడా.. ఆ గిరిజ కళ్ళని మర్చిపోగలమా...! "ఓయ్..! లేచిపోదామన్న మగాడా...!!" అన్న గిరిజ ఇంకా అలా కళ్ళముందు కనిపిస్తూనే ఉంటుంది... అంతే కాదు ఒక పాట మొత్తం సింగిల్ ఫ్రేమ్ లో తీసిపడేయటం ఆ పాటమొత్తం లోనూ ఒక ముద్దూ.... ఆ ఇద్దరు ప్రేమికుకుల కళ్ళూ మాత్రమే దర్శకుడి టార్గెట్ అనిపిస్తాయి...

మణికి వయసు మీద పడింది, అయినా ఆయన ఫ్రేమ్ మాత్ర అలా ఆ కళ్ళలా తాజాగానే ఉండిపోయింది... ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే. నిన్న వచ్చిన "చెలియా" టీజర్. మద్రాస్ టాకీస్ బ్యానర్ లో కార్తీ, అదితీ రావ్ హైదరీ జంటగా నటించిన "చెలియా" టీజర్ చూసారా..!? చూడక పోతే మళ్ళీ చూడండి.. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ఫ్రేమింగ్ అలా మంచు పడుతూ ఉంటే కదిలే రైల్లోంచి బయటికి చూస్తున్న అమ్మాయి జుట్టు తో మంచు పూలు రాలుతున్నట్టు...

అలా ఒక్కసారి మనవైపు చూసే రెండు కళ్ళు... దానికి ముందు ఒక డ్రోన్ షాట్ లో దూసుకు పోయే రైలు..., ఆ రెండు నిమిషాల్లో ఒక హాలీవుడ్ క్లాసిక్ చూసిన అనుభూతి "మన ఇండియన్ దర్శకుల్లో పస లేదండీ..!" అని చప్పరించే వాళ్ళుకూడా అద్బుతం అనేలా ఉన్న ఆ కళ్ళని ఒక్కసారి..మరో సారి మళ్ళీ చూడండి.... ఇలాంటి షాట్స్ తీయటం లో కొత్త దర్శకులకి మణి రత్నం ఒక గైడ్ లాంటివాడు అని చెప్పుకోవచ్చు....

English summary
An Exlent Freming Like Hollywood Mani Ratnam's Amaging Magic Again.., Hav you seen the Heroine Introduction in Cheliya Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu