»   » మణిరత్నం లేటెస్ట్ 'రావణ్' తెలుగు టైటిల్

మణిరత్నం లేటెస్ట్ 'రావణ్' తెలుగు టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నం ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందించిన 'రావణ్' చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. ఈ తెలుగు వెర్షన్ కు విలన్ అనే టైటిల్ ని నిర్ణయించారు. హిందీ, తమిళ్, తెలుగు మూడు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం జూన్ 18న రిలీజ్ కానుంది. అలాగే ఈ చిత్రం ఆడియోను సోనీ మ్యూజిక్ వారు తీసుకున్నారు. ఎఆర్ రహమాన్ ఈ చిత్రానకి సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రం టైటిల్ హిందీలో రావణ్, తమిళంలో రావణ, తెలుగులో విలన్ అని ఉంటుంది. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, అబిషేక్ బచ్చన్ కీ రోల్స్ చేసారు. తెలుగు, తమిళ వెర్షన్ లలో విక్రమ్ హీరోగా, పృధ్వీరాజ్ విలన్ గా కనిపిస్తారు. అయితే హిందీకి విక్రమ్ విలన్ గానూ అబిషేక్ బచ్చన్ హీరోగానూ కనిపిస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu