»   » మణిరత్నం 'రావణ్' చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

మణిరత్నం 'రావణ్' చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నం రావణ్ చిత్రం ఆడియో ఏప్రియల్ లో రిలీజ్ చేయనున్నట్లు అఫీషిల్ గా ప్రకటించారు. ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్, విక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంకి సంగీతం ఆస్కార్ విజేత ఎ.ఆర్.రహమాన్ అందించారు. ఇక మోడ్రన్ డే రామాయణంగా ఈ చిత్రం కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రియమణి కూడా ఓ కీలకమైన పాత్ర చేసిన ఈ చిత్రం జూన్ లో ధియోటర్స్ లోకి దూకనుంది. అబిషేక్ బచ్చన్ , ఐశ్వర్యారాయ్ లతో గురు చిత్రం రూపొందించిన మణిరత్నం గ్యాప్ తీసుకుని ఇదే కాంబినేషన్ తో చేసారు. అలాగే ఈ చిత్రం తమిళ,హిందీ భాషల్లో ఒకే సారి షూటింగ్ జరుపుకుంది. విక్రమ్...తమిళ బాషలో హీరోగా చేస్తూ, హిందీకి విలన్ గా చేసాడని సమాచారం. చాలా కాలం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఎ ఆర్ రహమాన్ సంగీతం తెలుగులో ఈ మధ్యన ఏ మాయ చేసావేకి అందించారు. నాగచైతన్య, సమంత కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం పాటలు మొల్లిగా ఎక్కాయి. అలాగే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పులికి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu