For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదరకొడుతున్న మణిరత్నం 'కడలి' (ఫొటోలు)

  By Srikanya
  |

  చెన్నై: మణిరత్నం తాదా చిత్రం 'కడలి' చిత్రం కు సంభందించిన మరిన్ని ఫోటోలను మణిరత్నం విడుదల చేసారు. అవి మణిసార్ అభిమానులను ఊహాలోకాల్లోకి తీసుకు వెళ్తున్నాయి. విజువల్ పోయిట్రీ గా ఈ చిత్రం ఉండబోతోందని వారు అంచనాలు వేస్తున్నారు. వారి అంచనాలుకు ఏ మాత్రం తగ్గరని మణిరత్నం చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు.

  ఈ చిత్రం ద్వారా... మాజీ హీరోయిన్ రాధ రెండవ కూతురు తులసి పరిచయమవుతోంది. రాధ పెద్ద కుమార్తె కార్తీక తెలుగు సినిమా 'జోష్‌' ద్వారా తెరంగేట్రం చేసింది. మణిరత్నం చేతుల మీదుగా చిన్న కుమార్తె తులసిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు రాధ. తమిళ చిత్రం 'కడల్‌' (తెలుగులో 'కడలి') ద్వారా తులసి నటిగా తొలి అడుగులు వేసింది.

  సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఇదిగో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ ఇలా క్యూట్ గా కనిపించనున్నారు.

  చిత్రంలో అర్జున్ కీ రోల్ చేస్తున్నారు. మంచు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది.

  మణిరత్నం రోజా చిత్రంలో హీరో గా చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. అరవింద్ స్వామి చాలా గ్యాప్ తర్వాత తెరపై కనిపిస్తున్నారు.

  MTV లో విడుదల చేసిన ‘నెంజికుల్లె' పాట అంతర్జాలంలో అద్భుతమయిన విజయం సాదించింది. దక్షిణ తమిళనాడులో ఒక పల్లెలో యువ జాలర్ల మధ్యన జరిగే ప్రేమకథగా ఈ చిత్రం ఉండబోతుంది.

  గౌతమ్‌కార్తీక్‌ గెటప్‌ మాత్రం మాస్‌ హీరోను తలపిస్తుండటంతో ప్రేక్షకులకు ఎవరి లెక్కలు వారేసుకుంటున్నారు.

  ''కార్తీక్‌ అంకుల్‌, అమ్మ కలసి 'అలైగల్‌ ఓయ్‌వదిల్త్లె' ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు. ఇప్పుడు వాళ్లబ్బాయి గౌతమ్‌ కార్తిక్‌, నేను కలసి 'కడల్‌' ద్వారా పరిచయమవడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది'' అంటోంది తులసి.

  మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మాన్ సంగీత బాణీలు కడుతుండగా, రాజీవ్‌మీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. శ్రీకార్ ప్రసాద్ కూర్పు బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.

  జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఇందు కోసం రూ. 25 కోట్ల వరకు ఆఫర్ చేశారని తమిళ సినీ వర్గాల సమాచారం. మణిరత్నం ఈ మధ్య వరుస ప్లాపులు ఎదుర్కొంటున్నా ఈ రేంజ్‌లో ఆఫర్ రావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

  అలాగే ఈ చిత్రంలో కార్తీక్ కుమారుడు గౌతమ్‌ కార్తీక్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈనెల 17న పాటల్ని ఆవిష్కరించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే ఈ చిత్రం సాంగ్ ప్రోమోను తమిళ,తెలుగు భాషల్లో విడుదల చేసారు. అది విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

  English summary
  Kadal is an upcoming Tamil film. Directed and Produced by Mani Ratnam. The film features debutant Gautham Karthik, son of actor Karthik and debutant Thulasi Nair, daughter of Radha in the lead roles. The film will be dubbed and released simultaneously in Telugu as Kadali.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X