మణిరత్నం కొత్త చిత్రం టైటిల్...హీరో ఫైనల్

గతంతో పోల్చితే వేగాన్ని తగ్గించిన ఆయన నాలుగేళ్లలో 'రావణ్', 'కడలి' మాత్రమే రూపొందించారు. ఇవి రెండూ పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోని నేపథ్యంలో, బాలీవుడ్ హీరో రణబీర్‌కపూర్‌తో ఆయన కొత్త చిత్రాన్ని చేయనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మణిరత్నం రూపొందించే చిత్రం మాతృభాష తమిళంలోనే ఉండనుందనే వార్త కోలీవుడ్ షికార్లు కొడుతోంది.
చెన్నైలోని ఫిలింఛాంబర్‌లో ఇటీవల 'కాట్రు' పేరుతో ఓ టైటిల్ నమోదైంది. ఈ పని చేసింది మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ 'మెడ్రాస్ టాకీస్' అట. దీంతో మణిరత్నం దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రం ఇదే అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలవాలంటే కొన్ని రోజులు ఆగకు తప్పదు మరి.


Click it and Unblock the Notifications











