»   » టైటిల్, ఫస్ట్‌లుక్‌తో అదరగొట్టిన మణిరత్నం.. వావ్ నెక్ట్స్ మూవీ తెలుగు టైటిల్ ఇదే..

టైటిల్, ఫస్ట్‌లుక్‌తో అదరగొట్టిన మణిరత్నం.. వావ్ నెక్ట్స్ మూవీ తెలుగు టైటిల్ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తదుపరి చిత్రానికి సంబంధించిన టైటిల్ ఖారారైపోయింది. అరవింద్‌స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరున్ విజయ్, అదితి రావు హైదరీ, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్ నటించే సినిమాకు 'చెక్క చివంత వానమ్' అని పేరుపెట్టారు. శుక్రవారం (ఫిబ్రవరి 9న) విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే స్పందన వస్తున్నది.

తెలుగులో నవాబ్‌గా

తెలుగులో నవాబ్‌గా

చెక్క చివంత వానమ్ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకు నవాబ్ అనే పేరును ఖరారు చేయడం గమనార్హం. ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

తప్పుకొన్న ఫహద్ ఫాజిల్

తప్పుకొన్న ఫహద్ ఫాజిల్

మణిరత్నం సినిమాలో తొలుత మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రకు ఎంపిక చేశారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఫహాద్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. ఈ పాత్ర కోసం నటుడి ఎంపిక మొదలైందనట్టు సమాచారం.

ఫిబ్రవరి 12న

ఫిబ్రవరి 12న

చెక్క చివంత వానమ్ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. 12వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, శింబు, అరున్ విజయ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారట. వారికి తల్లిదండ్రులుగా జయసుధ, ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్టు తెలిసింది.

మద్రాస్ టాకీస్‌పై

మద్రాస్ టాకీస్‌పై

మద్రాస్ టాకీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు తాను రూపొందించిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను మణిరత్నం తెరకెక్కించనున్నారట. ఈ చిత్రాన్ని యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది.

English summary
Filmmaker Mani Ratnam’s upcoming multi-starrer, which features an ensemble cast of Arvind Swami, Simbu, Vijay Sethupathi, Arun Vijay, Aditi Rao Hydari, Jyothika and Aishwarya Rajesh, has been titled Chekka Chivantha Vaanam, the makers officially announced on Friday along with the film’s first look poster. The film, which will be dubbed and released in Telugu, has been titled Nawab. Vijay Sethupathi, Arvind Swami, Simbu and Arun Vijay supposedly play brothers. Actors Jayasudha and Prakash Raj play their parents.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu