»   » మణిరత్నం - కార్తి మూవీ ఫస్ట్ లుక్ ఇదే...(ఫోటోస్)

మణిరత్నం - కార్తి మూవీ ఫస్ట్ లుక్ ఇదే...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తన సినిమాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నదర్శకుల్లో మణిరత్నంను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆయన సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే అభిమానుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. మణిరత్నం సినిమాలు ఇతర సినిమాలకు భిన్నంగా ఉండటం, ఆయన సినిమా తెరకెక్కించే విధానం ప్రత్యేకంగా ఉండటమే అందుకు కారణం.

మణిరత్నం కెరీర్లో కొన్ని ప్లాపులు ఉన్నప్పటికీ....ఆయన సినిమాలను అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. మణి చివరి సినిమా 'ఓకె కన్మణి'(తెలుగులో ఓకే బంగారం) చిత్రం భారీ విజయం సాధించిందిన సంగతి తెలిసిందే.

త్వరలో మణిరత్నం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తి హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి 'కాట్రు వెలియిదై' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో కార్తి సరసన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి నటిస్తోంది.

ఈ సినిమా ద్వారా తొలిసారి సౌత్ లో నటిస్తున్న అదితి రావు హైదరి తన ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. మణిరత్నం సినిమా అంటే సంగీతం ఏఆర్ రెహమానే ఉంటారు. ఈ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు.

స్లైడ్ షోలో ఫస్ట్ లుక్ పోస్టర్, మరిన్ని వివరాలు..

ఫస్ట్ లుక్ పోస్టర్

ఫస్ట్ లుక్ పోస్టర్

మణిరత్నం-కార్తి కాంబినేషన్లో వస్తున్న ‘కాట్రు వెలియిదై' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే..

ప్రేమకథా చిత్రమే..

ప్రేమకథా చిత్రమే..

మణిర్నతం సినిమా అంటేనే లవ్ యాంగిల్‌ను అద్భుతంగా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా అదే ఉంటుందని అంటున్నారు.

తెలుగులో కూడా..

తెలుగులో కూడా..

మణి, కార్తి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతాయి. తెలుగులో వీరిద్దరి సినిమాలకు మంచి డిమాండ్ ఉంది కూడా. త్వరలోనే తెలుగు పోస్టర్ రిలీజ్ చేస్తారు.

అదితిరావు హైదరి

అదితిరావు హైదరి

హైదరాబాద్ కు చెందిన అదితి రావు హైదరి ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో నటించలేదు. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.

English summary
Maniratnam - Karthi movie first look poster, Kaatru Veliyidai First look, Kaatru Veliyidai Firstlook Poster, Karthi New Movie First Look
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu